బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత సాజిద్‌ నదియావాలి సతీమణి వార్దా దివంగత నటి దివ్య భారతీ గురించి స్పందించారు. 18 ఏళ్ల వయసులోనే జాతీయ స్థాయిలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న దివ్య భారతీ ఈ చిన్న వయసులోనే ప్రముఖ నిర్మాత సాజిద్‌ నదియావాలాను వివాహం చేసుకుంది. అయితే ప్రమాదవశాత్తు ఐదో అంతస్తులో ఉన్న తన అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి కింద పడి దివ్య భారతీ మరణించింది. ఆ తరువాత చాలా ఏళ్లకు సాజిద్‌ విలేఖరి వార్దాను వివాహం చేసుకున్నాడు.

అయితే ఇటీవల వార్దా దివ్య భారతీతో తన కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం గురించి స్పందించింది. ఇన్నేళ్లలో తాను ఎప్పుడు దివ్య భారతి స్థానాన్ని భర్తి చేసేందుకు ప్రయత్నించలేదని చెప్పింది వార్దా. అంతే కాదు ఇప్పటికే దివ్య భారతి కుటుంభంతో సాజిద్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని తెలిపింది. అంతేకాదు దివ్యభారతి పుట్టిన రోజు, వర్ధంతి లాంటివి కూడా ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొని ఆ రోజు ఇంట్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు చేస్తారని తెలిపింది.

మా పిల్లలు కూడా దివ్య భారతిని పెద్ద మమ్మీ అనే అంటారని చెప్పింది. దివ్య భారతి తల్లి మరణం తరువాత ఆమె తండ్రి తమ కుటుంబానికి ఎంతో దగ్గరయ్యారని సాజిద్‌ సొంత కొడుకు లాగే ఆయన బాగోగులన్నీ చూసుకుంటున్నాడని చెప్పింది వార్దా. అంతేకాదు దివద్య భారతి స్థానాన్ని ఎవరు భర్తి చేయలేరని, నాకు అలా చేసే ఉద్దేశం లేదని చెప్పింది. ఆమె మా జీవితంలో భాగమని చెప్పింది.