బాలీవుడ్ హాట్ బ్యూటీ కరీనా కపూర్, స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ జంట 2012లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. సైఫ్ అలీ ఖాన్ కు ఇది రెండవ వివాహం. సైఫ్ గతంలో అమృత సింగ్ ని వివాహం చేసుకుని ఆమె నుంచి విడిపోయాడు. 2004లో విడాకులతో సైఫ్, అమృత సింగ్ విడిపోయారు. ఇబ్రహీం, సారా అలీ ఖాన్ వీరి సంతానమే. 

సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ పలు చిత్రాల్లో నటించాడు. సైఫ్ కరీనా ప్రేమలో పడి పడ్డాడు. ఈ విషయం గురించి కరీనా కపూర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. తషాన్ చిత్ర షూటింగ్ కోసం మేము గ్రీస్ వెళ్ళాము. అక్కడే మొదట సైఫ్ నాకు ప్రపోజ్ చేశాడు. 

ప్రేమిస్తున్నట్లు చెప్పడమే కాదు.. పెళ్లి చేసుకుందామా అని అడిగేశాడు. నేను ఒప్పుకోలేదు. మరోసారి లఢక్ లో ఉండగా అడిగాడు. అలోచించి చెబుతానని చెప్పా. కొన్ని రోజుల తర్వాత సైఫ్ కు ఓకే చెప్పా. కానీ ఓ కండిషన్ పెట్టా. వివాహం తర్వాత కూడా నా నటన వృత్తిని కొనసాగిస్తా. నాకు అడ్డు చెప్పకూడదు అని అడిగా. 

ఈ కండిషన్ కు సైఫ్ సంతోషంగా ఒప్పుకున్నాడు. నేను కానీ, నా ఫ్యామిలీ కానీ నీ వృత్తికి అడ్డు చెప్పము అని హామీ ఇచ్చాడు. అలా తమ వివాహం జరిగిందని కరీనా తెలిపింది. ప్రస్తుతం ఈ జంటకు తైమూర్ అనే కొడుకు ఉన్నాడు. తైమూర్ తన క్యూట్ లుక్స్ తో సోషల్ మీడియా స్టార్ గా మారిపోయాడు.