సాయిధరమ్ తేజ్ మంగళవారం రోజు తన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. దీనితో తేజుకి అభిమానుల నుంచి సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన బర్త్ డే సందర్భంగా తేజు సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశారు. 

నా బర్త్ డే సందర్భంగా అభిమానులు చాలా ప్రాంతాల్లో రక్తదానం, అన్నదానం చేస్తున్నారు. కొన్ని చోట్ల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు వారందరికీ నేను రుణపడి ఉంటాను. ఓ వృద్ధాశ్రమం నిర్మాణానికి సాయం చేయాలని కొందరు నన్ను కోరారు. ఆ వృద్ధాశ్రమం నిర్మాణ బాధ్యతని నేను తీసుకుంటున్నా. 

పుట్టినరోజు నాడు ఏదో ఒక శాస్వత కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నా. ఇక అభిమానులని కూడా నేను ఓ విషయం కోరుతున్నా. నా బర్త్ డేకి ఫ్లెక్సీలు వద్దు.వాటికోసం ఖర్చు చేసే డబ్బుని ఓల్డ్ ఏజ్ హోమ్ కి డొనేట్ చేయండి అని కోరాడు. ఇప్పటికే చాలా మంది అభిమానులు ఆ పని చేస్తున్నట్లు తేజు తెలిపాడు. 

ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మాణం పూర్తయిన ఒక సంవత్సరం వరకు నిర్వహణ బాధ్యతలు కూడా తీసుకుంటున్నట్లు తేజు తెలిపాడు. అభిమానులు ఇప్పటికే రూ. 1 లక్ష వరకు డొనేట్ చేశారని తేజు ట్విట్టర్ లో పేర్కొన్నాడు.