ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్  నటుడుగా నిలదొక్కుకోవటం చేయని ప్రయత్నం లేదు. తన అన్నయ్య ఇచ్చిన 143తో లవర్‌బాయ్ ఇమేజ్ రాగా ‘బంపర్ ఆఫర్’ సినిమా మాస్ ఇమేజ్‌ను అందించింది. కానీ టైమ్ కలిసిరాలేదు. ‘బంపర్‌ ఆఫర్‌’ తర్వాత సక్సెస్‌ జర్నీ కంటిన్యూ కావల్సింది. మధ్యలో చేసిన కొన్ని సినిమాల వల్ల కుదరలేదు. దాంతో గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరో సినిమాకు అంకురార్పణ చేసాడు.

అయితే ఇప్పుడు సాయిరాం శంకర్ హీరోగా చేస్తే జనం గుర్తు పట్టుకుని థియోటర్ కు వచ్చే పరిస్దితి ఉందా..ఈ గ్యాప్ లో చాలా మంది యంగ్ హీరోలు వచ్చేసారు. కెరీర్ లో సాలిడ్ హిట్ లేకపోవటంతో ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా పోయింది. అయితే ఒక్క హిట్ చాలా తనేంటో ప్రూవ్ చేసుకోవటానికి అనేది సినిమా వాళ్ల నమ్మకం. సాయి సోదరుడు పూరి జగన్నాథ్ కూడా ..రీసెంట్ ఇస్మార్ట్ శంకర్ తో వరస ఫ్లాప్ ల నుంచి బయిటపడ్డారు.

నాని కొత్త సినిమా టైటిల్ 'టక్ జగదీష్'!

ఇప్పుడు అదే నమ్మకంతో సాయిరాం శంకర్ ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా గురించి జనం మాట్లాడుకోవాలంటే గట్టిగా ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎవరూ పట్టించుకోరు. మినిమం ఓపినింగ్స్ కూడా రావాలి. కాబట్టి ముందు సౌండ్ చేసి..ఆ తర్వాత రీసౌండ్ గురించి ఆలోచించుకోవాలి.

రియల్ రీల్స్ ఆర్ట్స్, అమృత హరిణి క్రియేషన్స్, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్  పతాకం పై దర్శకుడు పూరి జగన్నాధ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరో గా రాశి సింగ్ హీరోయిన్ గా కృష్ణ చిరుమామిళ్ల దర్శకతం లో జె సురేష్ రెడ్డి, రాజు, ఎన్ వి ఎన్ రాజా రెడ్డి సంయుక్తం గా నిర్మిస్తున్న చిత్రం 'రి సౌండ్ '.  తాజాగా ఘనంగా ప్రారంభమైంది . ముఖ్య అతిధులు, స్టార్ చిరంజీవి తో సైరా సినిమా తో విజయ కెరటం ఎగరవేసిన దర్శకుడు సురేంద్ర రెడ్డి కెమెరా స్విచ్  ఆన్ చేసారు.   డైరెక్టర్ సుకుమార్ క్లాప్ ఇవ్వగా  . మొదటి షాట్ కు పోసాని కృష్ణ మురళి దర్శకత్వం వహించారు.  
 
హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ " ఆర్య తో దర్శకుడు సుకుమార్ మంచి హిట్ సౌండ్ చేసారు ఇప్పుడు రంగస్థలం తో రీసౌండ్ చేసాడు, అతడొక్కడే తో దర్శకుడు సురేంద్ర రెడ్డి హిట్ సౌండ్ చేసారు ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి తో సైరా సినిమా తో రీసౌండ్ చేసాడు. మా సినిమా పేరు రీసౌండ్ , మంచి కథ, కొత్త గా ఉంటుంది. వెంటనే షూటింగ్ ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నాం. అని కమర్షియల్ ఎలెమెంట్స్ ఉంటాయి. అందరిని అలరిస్తుంది . మా సినిమా ప్రారంభానికి వచ్చిన  సుకుమార్ గారి కి  సురేంద్ర రెడ్డి గారికి  ధన్యవాదాలు.

నిర్మాతలు రాజా రెడ్డి మాట్లాడుతూ " మంచి కమర్షియల్ సినిమా అవుతుంది. సాయి రామ్ శంకర్ కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. సుకుమార్ గారికి, సురేంద్ర రెడ్డి గారికి మా సినిమా ఫంక్షన్ కి వచ్చినందుకు ధన్యవాదాలు . మంచి కథ ప్రతి ప్రేక్షకుడికి నచుతుంది" అని తెలిపారు.