తన నటనతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది సాయి పల్లవి. 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రానా సరసన 'విరాటపర్వం' అనే సినిమాలో నటిస్తోంది.

దర్శకుడు వేణు ఊడుగుల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే నాగచైతన్య, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకున్నారు.

అమెరికాలో ప్రియుడితో నయన్ బర్త్ డే సెలబ్రేషన్స్!

ఇటీవల ఈ బ్యూటీకి కమర్షియల్ యాడ్ లో నటించే ఛాన్స్ వచ్చింది. దీనికోసం ఆమెకి భారీగా రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారు. కానీ అదొక ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ కావడంతో తను అలాంటి విషయాలను ప్రమోట్ చేయనని తనకొచ్చిన ఆఫర్ రిజెక్ట్ చేసింది. తాజాగా మరో కోటి రూపాయల డీల్ వదులుకున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ క్లోతింగ్ కంపనీ వారు తమ బ్రాండ్స్ కి సంబంధించిన యాడ్ లో నటించమని సాయి పల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కంపనీకి చెందిన యాడ్ లో నాగచైతన్య నటించారు. ఇప్పుడు సాయి పల్లవిని కూడా నటించమని కోటి  రూపాయలు ఆఫర్ చేశారు.

ఏడాది పాటు ఈ యాడ్ ని ప్రసారం చేస్తామని చెప్పారు. కానీ దానికి సాయి పల్లవి అంగీకరించలేదని తెలుస్తోంది. యాడ్స్ లో నటించడం తనకు నచ్చదని.. తనకంటూ కొన్ని పరిమితులు విధించుకున్నానని చెప్పి తనకు వచ్చిన ఆఫర్ ని రిజెక్ట్  చేసిందట.