ఫిదా సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని స్టార్ డైరెక్టర్ గా మారిన శేఖర్ కమ్ముల ఇప్పుడు అదే తరహాలో మరో సక్సెస్ అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సాయి పల్లవి - నాగ చైతన్యలతో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే..  చిత్ర యూనిట్ లవర్స్ డే ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల్ల సినిమాను లాంచ్ చేసిన చిత్ర యూనిట్ మరికొన్ని రోజుల్లో షూటింగ్ స్పీడ్ పెంచనుంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జనవరి ఎండింగ్ కల్లా పూర్తి చేయాలనీ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఫిదా తరహాలోనే దర్శకుడు మళ్ళీస్క్రీన్ పై మ్యాజిక్ చేయబోతున్నట్లు టాక్ వస్తోంది.  ఫైనల్ గా సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనీ ఇటీవల చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం నాగ చైతన్య వెంకీ మామ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా చిత్రీకరణ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. నవంబర్ మిడ్ లో గాని లేక స్టార్టింగ్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. బాబీ తెరకెక్కిస్తున్న వెంకీ మామ సినిమాని సురేష్ బాబు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పాయల్ రాజ్ పుత్ - రాశి ఖన్నా వెంకీ మామ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.