సాయి పల్లవి - నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఎప్పుడు వస్తుందా అని ఓ వర్గం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచుస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కాంబినేషన్ పై ఇటీవల అంచనాలు డోస్ గట్టిగానే పెరుగుతున్నాయి. ఒక తక్కువ కులానికి చెందిన కుర్రాడిగా నాగ చైతన్య సినిమాలో కనిపించబోతున్నాడట.

 గతంలో ఎప్పుడు లేని విధంగా సాయి పల్లవి కూడా ఈ కథలో కొత్తగా కలిపించబోతుందట. ఇదివరకే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి ఫిదా సినిమా చేసింది. ఆ సినిమా ఏ స్థాయిలో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పలేదు. ఇక ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో హిట్ అందుకోవడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం సిన్ సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు వేగాన్ని అందుకున్నాయి.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ లవర్స్ డే సందర్బంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలని అనుకున్నారు.

కానీ సినిమా షూటింగ్ ఎండ్ కావడానికి ఇంకాస్త సమయం అవసరమని అలాగే ప్రమోషన్స్ కి కూడా కొంత సమయం ఉండాలని శేఖర్ కమ్ముల విడుదల తేదీని మార్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2వ తేదీన స్మమార్ కానుకగా సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ కొత్త ప్లాన్ రెడీ చేసుకున్నట్లు సమాచారం. మజిలీ సినిమాతో సక్సెస్ అందుకున్న నాగ చైతన్య ఈ సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.