తన అధ్బుతమైన నటన, డాన్స్ లతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న నటి సాయి పల్లవికి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 'ప్రేమమ్' సినిమాతో ఎందరో హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ  తెలుగులో 'ఫిదా' సినిమాతో ఎంట్రీ ఇచ్చి భానుమతి పాత్రలో తన సత్తా చాటింది.

మొదటి నుండి కూడా గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ.. నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రల్లో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. తాజాగా ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన 'ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30' లిస్ట్ లో సాయి పల్లవి పేరు ఉండడం విశేషం.

ముప్పై ఏళ్లలోపు తమ తమ రంగాల్లో విజయాలను సాధించిన 30 వ్యక్తుల జాబితాను ప్రతీ ఏడాది ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటిస్తూ ఉంటుంది. ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో సాయి పల్లవికి చోటు దక్కింది.

దీంతో సాయిపల్లవి సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు, ఫోర్బ్స్ కి కృతజ్ఞతలు చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో శేఖర్ కమ్ముల రూపొందిస్తోన్న 'లవ్ స్టోరీ' అలానే వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న 'విరాటపర్వం' చిత్రాల్లో నటిస్తోంది.