భానుమతి.. హైబ్రిడ్ పిల్ల.. ఒక్కటే పీస్ అంటూ యువతని మాయ చేసింది సాయి పల్లవి. ఫిదా చిత్రంతో సాయి పల్లవి టాలీవుడ్ కు పరిచయమైంది. అంతకు ముందే మలయాళంలో సాయి పల్లవి ప్రేమమ్ చిత్రం ద్వారా క్రేజ్ తెచ్చుకుంది. కానీ తెలుగులో గుర్తింపు లభించింది మాత్రం ఫిదా చిత్రంతోనే. 

శేఖర్ కమ్ముల దర్శత్వంలో తెరకెక్కిన ఆ చిత్రంలో సాయి పల్లవి వరుణ్ తేజ్ తో కలసి అద్భుతమైన కెమిస్ట్రీ పండించింది. సాయి పల్లవికి తెలుగులో ఎక్కువ విజయాలు లేకున్నప్పటికీ ఆమెకు ఉండే క్రేజే వేరు. సాయి పల్లవి నటన, చలాకీతనం. ఆటిట్యూడ్ అభిమానులకు బాగా నచ్చేశాయి. 

ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ చిత్ర పరిశ్రమలో సక్సెస్ లేకుంటే కష్టం. తాజాగా సాయిపల్లవి టాలీవుడ్ నిర్మాతల గుండెల్లో ఒక పెద్ద బాంబే పేల్చింది. మీడియం రేంజ్ చిత్రాలకు సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకునే వాళ్లకు ఇది చేదు వార్తే. తాజాగా సాయి పల్లవి తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. 

తాజా సమాచారం మేరకు సాయి పల్లవి సినిమాకు 1.40 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు టాక్. సాయి పల్లవి ఇంతలా రెమ్యునరేషన్ పెంచేయడంతో నిర్మాతలు కంగుతింటున్నారు. సాయి పల్లవి డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ దాదాపుగా సమంత, అనుష్క, కాజల్  లాంటి స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్ తో సమానం. 

ఎంత క్రేజ్ ఉంటే మాత్రం సాయి పల్లవి ఇంతలా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందా అంటూ టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఇకపై తమ చిత్రాల్లో సాయి పల్లవిని తీసుకోవాలనే నిర్మాతలు ఆమె అడిగినంత సమర్పించుకోవాల్సిందే.