టాలీవుడ్ లో ఒక సక్సెస్ అందుకుంటే ఆటోమేటిక్ గా నార్త్ లో సైతం మంచి అవకాశాలు అందుకోవచ్చని చాలా మంది హీరోయిన్స్ ఒక సెంటిమెంట్ గా ఫీలవుతారు. కొత్తగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే మోడల్స్ టాలీవుడ్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే మొదటి సినిమా మంచి సక్సెస్ అందుకున్నంత మాత్రాన అది అంత ఈజీ కాదని ఆర్ఎక్స్ 100బ్యూటీ పరిస్థితి చుస్తే అర్ధమవుతోంది.

అందుకు కారణం ఆమె ఎంచుకున్న పాత్ర.  ఆర్ఎక్స్ 100 సినిమాలో గ్లామర్ పరంగా పాయల్ మంచి క్రేజ్ అందుకుంది. అదే విధంగా ఆమె సినిమాలో చేసిన నెగిటివ్ పాత్ర జనాలకు మరింత లోతుగా ఎక్కేసింది. పాయల్ ఏ సినిమా చేసినా అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ఇటీవల RDX  అనే సినిమా చేసిన అమ్మడు అందాలను గట్టిగానే అర్దబోసింది.

కానీ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. అవకాశాలు కూడా అనుకున్నంత రేంజ్ లో దక్కడం లేదు.  అందుకు కారణం ఆమె RX100 లో చేసిన నెగిటివ్ రోల్. ఓ వర్గం ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకొని స్టార్ హీరోలు బేబీకి అవకాశం ఇవ్వడం లేదనే టాక్ వస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ - సీత సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసిన అమ్మడు ఆ తరువాత అదృష్టం కొద్దీ వెంకీ మామ సినిమాలో అవకాశం దక్కించుకుంది.

ఆ సినిమాలు ఏ మాత్రం క్లిక్కవ్వలేదు. ఇక పాయల్ ని కూడా ఎవరు పట్టించుకోలేదు.  ఇక ప్రస్తుతం ఆమె ఆశలన్నీ వెంకీ మామ సినిమాపైనే పెట్టుకుంది. అలాగే డిస్కో రాజా సినిమా కూడా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాల్లో అమ్మడు ఎలాంటి పాత్రల్లో నటించిందో తెలియదు గాని గ్లామర్ డోస్ మాత్రం గట్టిగానే ప్రజెంట్ చేసిందని టాక్ వస్తోంది.

ఆ రెండు సినిమాల్లో కూడా ఇతర హీరోయిన్స్ తో  స్క్రీన్ షేర్ చేసుకోనుంది కాబట్టి సినిమా హిట్టవ్వడమే కాకుండా పాయల్ పాత్ర కూడా క్లిక్కవ్వాలి. మరి  ఆ సినిమాలతో అమ్మడు RX100 మచ్చను తొలగించుకుంటుందో లేదో చూడాలి.