టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ చాలా కాలంగా ప్రేమలో ఉంది. ఇప్పుడు ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్ ని అభిమానులకు పరిచయం చేసింది.

ఇతడి పేరు సౌరభ్ డింగ్రా. ఇతడు ముంబైకి చెందిన మోడల్. చాలా కాలంగా అతడితో డేటింగ్ లో ఉంది పాయల్. సౌరభ్ పుట్టినరోజు సందర్భంగా అతడితో కలిసి తీసుకున్న ఫోటోని షేర్ చేస్తూ.. తనలోని లోపాలను ప్రేమించే ఏకైక వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చింది.

పాయల్ రాజ్ పుత్ క్లీవేజ్ అందాల వల.. స్టన్నింగ్ ఫొటోస్ వైరల్

సౌరభ్ గురించి ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మందికి తెలుసు. అతడు పాయల్ సినిమా షూటింగ్స్ కి వస్తుంటాడట. ఇక పాయల్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ఆమె నటించిన 'డిస్కో రాజా' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

ఈ బ్యూటీకి కుర్ర హీరోలతో నటించే ఛాన్స్ ల కంటే సీనియర్ హీరోలతో నటించే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. అయినప్పటికీ పాయల్ మాత్రం వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'ఏంజెల్' అనే తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది.