ఫిమేల్ యాంకర్ల హవా కొనసాగుతున్న టాలీవుడ్ లో మేల్ యాంకర్ ప్రదీప్ దూసుకుపోతున్నాడు. బుల్లితెరపై ప్రదీప్ యాంకర్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. 

టాలీవుడ్ లో యాంకర్ గా ప్రదీప్ చాలా బిజీ. పాపులర్ షోలు ఢీ, కొంచెం టచ్ లో ఉంటె చెప్తా లాంటి షోలతో ప్రదీప్ బిజీగా ఉండేవాడు. టాలీవుడ్ ఈవెంట్స్, పార్టీలలో కూడా ప్రదీప్ హల్ చల్ చేసేవాడు. కానీ గత నెలరోజులుగా ప్రదీప్ కనిపించడం లేదు. దీనితో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు జోరందుకున్నాయి. 

ప్రదీప్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని, కోలుకోవడానికి ఇంకొంత సమయం పడుతుందని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రదీప్ రీసెంట్ గా సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నట్లుగా కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇవన్నీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు మాత్రమే. 

అసలు ఇంతకీ ప్రదీప్ కు ఏమైంది.. ఎందుకు అజ్ఞాతంలో ఉన్నాడనే విషయంలో స్పష్టమైన వివరాలు లేవు. కానీ అందుతున్న సమాచారం మేరకు ప్రదీప్ ఓ షూటింగ్ లో భాగంగా గాయపడ్డాడట. కాలికి గాయం కావడంతో వైద్యులు నెలరోజులు విశ్రాంతి సూచించినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ప్రదీప్ కోలుకుని తిరిగి బుల్లి తెరపై యాంకర్ గా బిజీ అవుతాడని అంటున్నారు. 

ప్రదీప్ యానకరింగ్ లో రాణిస్తూనే జులాయి, అత్తారింటికి దారేది లాంటి చిత్రాల్లో నటించాడు.