అందాల చందమామ కాజల్ అగర్వాల్ సౌత్ లో తిరుగులేని హీరోయిన్. కాజల్ దాదాపుగా అందరు స్టార్ హీరోలతో నటించింది. వన్నె తరగని అందంతో కాజల్ ఇప్పటికి అభిమానులని అలరిస్తోంది. దాదాపు దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగడం అంటే మాటలు కాదు. 

కాజల్ అగర్వాల్ చివరగా తెలుగులో రణరంగం, సీత చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు కాజల్ కు నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతం శంకర్ దర్శత్వంలో కమల్ హాసన్ సరసన ఇండియన్ 2 చిత్రంలో నటిస్తోంది. కాజల్ అగర్వాల్ వయసు 34 ఏళ్ళు. కాజల్ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఆమె పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

 

కాజల్ వివాహంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల కాజల్ అగర్వాల్ మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమంలో తన పెళ్లి గురించి ప్రస్తావించింది. తాను త్వరలోనే వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు కాజల్ తెలిపింది. తనకు కాబోయే భర్త చిత్ర పరిశ్రమకు చెందినవాడు మాత్రం కాదని తెలిపింది. 

అదేవిధంగా తన భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా కాజల్ వివరించింది. తనకు కాబోయే భర్త తెలివైనవాడు, దైవ భక్తి కలవాడు అయి ఉండాలి అని తెలిపింది. తాజాగా సోషల్ మీడియాలో  కాజల్ అగర్వాల్ కు కాబోయే భర్త గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. 

కాజల్ త్వరలో పెద్దలు కుదిర్చింది వివాహం చేసుకోబోతోందని అంటున్నారు. ఆమె తల్లి దండ్రులు కాజల్ కు ఓ బిజినెస్ మ్యాన్ సంబంధం కుదిర్చినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాదే కాజల్ అగర్వాల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. 

దీనిపై కాజల్ కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఊహాగానాలు ఎంతవరకు వాస్తవమో తేలాలంటే కాజల్ స్పందించాల్సి ఉంది. కాజల్ అగర్వాల్ సౌత్ లో చిరంజీవి, పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్, అజిత్ లాంటి స్టార్స్ అందరితో ఆడిపాడింది.