మోడల్ గా ఫ్యాషన్ వరల్డ్ లో ఓ వెలుగు వెలిగిన హాట్ బ్యూటీ సోనాల్ చౌహన్ చాలా కాలం తరువాత బిజీ బిజీగా మారుతోంది. కెరీర్ మొదట్లో చిన్న బడ్జెట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ తక్కువ కాలంలోనే బాలీవుడ్ గ్లామర్ గర్ల్ గా ఎదిగింది. ఇకపోతే అమ్మడు తెలుగులో హీరోయిన్ గా 7 సినిమాలు చేస్తే అందులో బాలయ్యతోనే మూడు సినిమాలు చేసింది.

 లెజెండ్ - డిక్టేటర్ సినిమాలు క్లిక్కవ్వడంతో మూడవసారి రూలర్ సినిమాలో నటించడానికి సోనాల్ సింగిల్ సిట్టింగ్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే బేబీ రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. నార్త్ లో అవకాశాలు గట్టిగా వస్తునట్లు చెప్పుకుంటున్న అమ్మడు రూలర్ సినిమాకు 60లక్షల పారితోషికాన్నీ తీసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో 30లక్షల వరకే అందుకున్న సోనాల్ ఇప్పుడు డబుల్ రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక రూలర్ సినిమా హిట్టయితే ఆ డోస్ ఇంకాస్త పెరిగేలా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో అడపాదడపా హిట్స్ అందుకుంటున్న అమ్మడు కోలీవుడ్ - టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బిజీగా మారే అవకాశం ఉంది.

ఇప్పటికే టాలీవుడ్ లో మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. అందుకు సంబందించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  రూలర్ సినిమాకు కమర్షియల్ గా పాజిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంది. మాస్ ఆడియెన్స్ ని బాలయ్య తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాడు. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాకు కెఎస్.రవికుమార్ దర్శకత్వం వహించాడు.