నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎన్టీఆర్ (NTR jr), కొణిదెల ఫ్యామిలీ మెగా వారసుడు రామ్ చరణ్ (Ram Charan)... రియల్ లైఫ్‌లో వీళ్ళిద్దరూ స్నేహితులు. రీల్ లైఫ్‌లోనూ స్నేహితులుగా నటించిన సినిమా 'ఆర్ఆర్ఆర్' (RRR Movie). ఈ కాంబినేషన్‌ను తెరపైకి తీసుకొచ్చిన ఘనత దర్శకుడు రాజమౌళిది (Rajamouli).
సినిమా వాళ్లు కలెక్షన్స్ లెక్కేసేటప్పుడు...ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ని నమూనాగా తీసుకుంటారు. హిట్ సినిమా అక్కడ ఆడే లెక్కలను బట్టే చాలా సినిమాలకు క్రేజ్ ఉంటుంది. ‘ఆర్.టి.సి క్రాస్ రోడ్స్’ ఏరియాలో ఎంత కలెక్ట్ చేసింది అనేది ఫ్యాన్స్ ప్రెస్టీజియస్ గా తీసుకుంటూ ఉంటారు. తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం అక్కడ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అక్కడ అద్భుతాలను సృష్టిస్తోంది.రిలీజైన రోజు నుంచి ఇక్కడ అన్ని థియేటర్లలో ఆర్ఆర్ఆర్ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ సినిమా సుదర్శన్ థియోటర్ లో 5 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. రిలీజైన 43 రోజుల్లో ఈ స్దాయి గ్రాస్ ఏ సినిమాకు ఈ మధ్యకాలంలో రాలేదంటున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన ప్యాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమా "ఆర్ ఆర్ అర్". ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25న థియేటర్లో విడుదలైంది. అనుకున్న విధంగానే మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అజయ్ దేవగన్, శ్రీయ శరణ్, సముతిరఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది.
రిలీజ్ అయ్యి ఇంతకాలం అయినా...వీక్ డేస్ లో ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు తగ్గినా వీకెండ్ లో మాత్రం భారీస్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి.చరణ్, తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాతో దక్కిన సక్సెస్ ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూడాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత చరణ్, తారక్ భవిష్యత్ సినిమాలు భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనున్నాయి. చరణ్ రీసెంట్ గా ఆచార్య రిలీజ్ అయ్యింది. ఇక తారక్ ప్రస్తుతం బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నారు.తారక్ కొత్త సినిమా కొరకు ఏకంగా 8 కిలోల బరువు తగ్గనున్నారని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.
