ప్రముఖ నిర్మాత డివివి దానయ్య.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఆయన గత వారం గుండెలో కొద్ది పాటి నొప్పి రావటంతో ఇమ్మీడియట్ గా హాస్పటిల్ కు వెళ్లారు. డాక్టర్స్ టెస్ట్ చేసి, స్టెంట్ వేసారు. ప్రస్తుతానికి ఆయన క్షేమంగానే ఉన్నారు. రికవరీ అవుతున్నారు. ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీ పెద్దలు ఆయనకి ఫోన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం దానయ్య ప్రతిష్టాత్మకమైన ఆర్ ఆర్ ఆర్ ని నిర్మిస్తున్నారు. 

మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ లు హీరోలుగా దర్శకుధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ ఆర్‌ ఆర్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్  చాలా రోజులుగా జరుగి,కరోనా ఎఫెక్ట్ తో బ్రేక్ ఇచ్చారు.  త్వరలో షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. 

ఈ సినిమాలో ఆలియా భట్, అజయ్‌ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. ఇప్పటికే చరణ్‌ పుట్టినరోజుకి ఓ టీజర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రంటీమ్. ఈ టీజర్‌లో రామ్‌ చరణ్‌ యుద్ధ విద్యలు నేర్చుకుని యుద్ధానికి తయారవుతున్నట్టు కనిపించారు. ఈ సినిమాలో బాక్సింగ్‌కి సంబంధించి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని అంటున్నారు యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కుల్దీప్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది.
 
మరో ప్రక్క దానయ్య తన కొడుకు కళ్యాణ్ ని హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తన కొడుకు కళ్యాణ్ సరసన నటించే భామగా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేశారట. అయితే ఈ చిత్రాన్ని తాను నిర్మించకుండా మరొకరికి నిర్మాణంలో చేయాలనీ చూస్తున్నాడట.