టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ RRR ఎవరు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ఎప్పుడు ఎలాంటి విషయాన్నీ చెప్పాలో రాజమౌళికి బాగా తెలుసు. సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఇవ్వడంలో ఆయన మరోసారి తన పనితనాన్ని బయటపెట్టారు. RRR సినిమాకు సంబందించిన రెండు స్పెషల్ అప్డేట్స్ ని అందించారు.

సినిమాలో తారక్ కి జోడిగా ఒలీవియా మోరిస్ ని సెలెక్ట్ చేసిన చిత్ర యూనిట్ మెయిన్ విలన్ గా హాలీవుడ్ ప్రముఖ నటుడు రే స్టీవెన్స్ ని ఫైనల్ చేశారు. అతను ఈ సినిమాలో స్కాట్ గా కనిపించబోతున్నాడు. మర్వెల్ స్టూడియోస్ 'థార్' వంటి సినిమాల్లో నటించిన ఈ యాక్టర్ RRR లో మెయిన్ గా విలన్ గా కనిపించబోతున్నాడు.

అతని లుక్ చూస్తుంటే జక్కన్న ఆలోచన మరోసారి తెరపై క్లిక్కయ్యేలా ఉంది. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో విలన్స్ ఆ రేంజ్ లో ఉంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.  హీరోలకంటే బలంగా ఉండే విలన్స్ ని హీరో నాశనం చేయడం జక్కన్న ఫార్ములా. ఆ ఫార్ములా స్క్రీన్ పై ప్రతిసారి సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు కూడా 'రే స్టీవెన్ సన్' లాంటి బలమైన యాక్టర్ ని ఎన్నుకొని పాత్రకు తగ్గట్టు మేకోవర్ చేయడం అద్భుతంగా ఉంది.

అతని లుక్ చూస్తుంటేనే భయంకరంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. మరి సినిమాలో ఎలా కనిపిస్తాడో.  ఇకపోతే సినిమా షూటింగ్ కి హీరోల గాయలకారణంగా మద్యమద్యలో అంతరాయాలు ఏర్పడినప్పటికీ దర్శకుడు రాజమౌళి ఏ మాత్రం తొందరపడకుండా అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నాడు.

ఇప్పటికే సినిమా షూటింగ్ 70% పూర్తయినట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. తారక్ కొమురం భీమ్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.   ఇద్దరి పాత్రలకు సంబందించిన సన్నివేశాలను సమానంగా పూర్తి చేస్తున్న జక్కన్న మిగతా 30% షూటింగ్ ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ కష్టపడుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా 350కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న తెలుగు సినిమాగా RRR సినీ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.