చాలా రోజుల తరువాత RRR చిత్ర యూనిట్ పాత్రలకు సంబందించిన అప్డేట్స్ తో సౌత్ ఇండస్ట్రీలో కాస్త హడావుడి చేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శకధీరుడు రాజమౌళి ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నాడని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక కథానుసారంగా విదేశీ యాక్టర్స్ ని కూడా దింపుతుండడంతో సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్ లో ఆసక్తిని రేపుతోంది.

ఇకపోతే సినిమాలో ఎన్టీఆర్ ని ఇష్టపడే అమ్మాయిగా ఒలీవియా నటించనున్న విషయం తెలిసిందే. ఆమె డ్యాన్స్ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందట=. అలాగే రామ్ చరణ్ - అలియా భట్ మధ్య కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందని టాక్ వస్తోంది. రామ్ చరణ్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. అల్లూరి మరదలిగా అలియా భట్ నటిస్తోంది. వీరిద్దరి మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ ని కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం.

సంగీత దర్శకుడు ఎమ్ఎమ్.కీరవాణి ఇప్పటికే కొన్ని ట్యూన్స్ చేసి రెడీగా ఉంచాడు. సినిమాలో టైటిల్ సాంగ్ కోసం ట్యూన్ కి దర్శకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమాలో ఎక్కడా కూడా రొమాన్స్ డోస్ పెరగకుండా ఒక పాజిటివ్ వేలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ -రామ్ చరణ్ మధ్య కూడా ఒక స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అల్లూరి, కొమరం భీం రెండేళ్ల పాటు యుక్తవయసులో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ రెండు సంవత్సరాలు ఏం జరిగి ఉంటుందనే ఆసక్తికర అంశాన్ని రాజమౌళి కల్పిత గాధగా తెరక్కించబోతున్నారు. 

కాజల్, అనుష్క కోసం ట్రై చేశారు.. తెలుగు అమ్మాయిల విషయంలో అది నిజమే!

డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఇంగ్లీష్ భామ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తుండగా.. రే స్టీవెన్సన్, అలిసన్ డూడి విలన్లుగా నటిస్తున్నారు.