Asianet News TeluguAsianet News Telugu

RRR ఎఫెక్ట్.. ఇంగ్లీష్ బ్యూటీకి పిచ్చ ఫాలోయింగ్

సినిమా షూటింగ్ మొదలై ఏడాది అయినప్పటికీ సినిమాకు సంబందించిన సరైన అప్డేట్ రాలేదు, మంచి ఆకలి మీద ఉన్న మెగా నందమూరి అభిమానులకు ఎలాంటి అప్డేట్ ఇస్తే బెటర్ అని గత కొన్ని వారాలుగా ఆలోచించిన జక్కన్న మొత్తానికి విదేశీ తారల గురించి చెప్పేశాడు. 

RRR effect on Olivia Morris good responce in soscial media
Author
Hyderabad, First Published Nov 21, 2019, 5:32 PM IST

RRR సినిమాకు సంబందించిన స్పెషల్ అప్డేట్స్ తో చిత్ర యూనిట్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. సినిమా షూటింగ్ మొదలై ఏడాది అయినప్పటికీ సినిమాకు సంబందించిన సరైన అప్డేట్ రాలేదు, మంచి ఆకలి మీద ఉన్న మెగా నందమూరి అభిమానులకు ఎలాంటి అప్డేట్ ఇస్తే బెటర్ అని గత కొన్ని వారాలుగా ఆలోచించిన జక్కన్న మొత్తానికి విదేశీ తారల గురించి చెప్పేశాడు.

RRR effect on Olivia Morris good responce in soscial media

హీరోయిన్, మెయిన్ విలన్ అలాగే లేడి విలన్ కి సంబందించిన వివరాలని భయపెట్టిన విషయం తెలిసిందే. అయితే వారికి ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో దక్కుతున్న ఆదరణ అంతా ఇంతా కాదు. హీరోయిన్ ఒలీవియా ట్విట్టర్ ఫాలోవర్స్ అయితే ఒక్కసారిగా పెరిగిపోయారు. వందల ఫాలోవర్స్ పదిహేను వేలు దాటేశారు. థియేటర్ ఆర్టిస్ట్ గాఉన్న ఒలీవియా మోరిస్ RRRలో నటిస్తోంది అనగానే ట్విట్టర్ ఫాలోవర్స్ 400 నుంచి 17,000కు పెరిగిపోయారు.

గూగుల్ టాప్ సెర్చ్ లిస్ట్ లో ఒలీవియా పేరు ఉండడం విశేషం. బేబీకి ఒక్కసారిగా పిచ్చ ఫాలోయింగ్ వచ్చిందనే చెప్పాలి. ఇక విలన్ పాత్రలో కనిపించనున్న థార్ యాక్టర్ రే స్టీవెన్సన్ కి కూడా ఇండియాలో మంచి ఫాలోయింగ్ పెరుగుతోంది. RRR నటిస్తున్నారు అనగానే ఒక్కసారిగా వీరి పేర్లు హాట్ టాపిక్ అయ్యాయి. మరి ఈ క్రేజ్ తో హాలీవుడ్ యాక్టర్స్ మున్ముందు ఇండియాలో ఎలాంటి ఆఫర్స్ అందుకుంటారో చూడాలి.

వివాదంలో 'జార్జిరెడ్డి'.. రిలీజ్ అడ్డుకుంటామంటూ హెచ్చరికలు!

 

Follow Us:
Download App:
  • android
  • ios