సినిమాపై ఎప్పుడు ఎలా బజ్ క్రియేట్ చేయాలో జక్కన్నకి బాగా తెలుసు. సినిమాకు సంబందించిన అప్డేట్స్ తోనే సినిమాకు కావాల్సినంత ప్రమోషన్స్ చేస్తారు. గత కొన్ని రోజుల క్రితం సినిమాలో నటించబోయే హాలీవుడ్ ఇంగ్లీష్ యాక్టర్స్ ని ఆడియెన్స్ కి పరిచయం చేసిన రాజమౌళి ఇటీవల మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో సినిమా హాట్ టాపిక్ అయ్యేలా చేశాడు.

అజయ్ దేవ్ గన్ ఇక నుంచి RRR రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటాడని చెబుతూ.. అజయ్ తో రాజమౌళి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. నిమిషాల్లోనే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమాకు సంబందించిన అనేక రూమర్స్ కూడా మొదలయ్యాయి.  అజయ్ దేవగన్ పాత్రకు సంబందించిన ఒక రూమర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అజయ్ దేవగన్ మరొక స్వాతంత్య్ర సమరయోధుడిగా కనిపించబోతున్నట్లు చాలా రోజులుగా టాక్ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే పాత్ర కోసం కూడా జక్కన్న భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అజయ్ దేవగన్ క్లి సంబందించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం 12కోట్ల మేర బడ్జెట్ నిర్ణయించినట్లు సమాచారం.  సింగిల్ షెడ్యూల్ లోనే ఆ సీన్స్ ను చిత్రీకరించనున్నారట.

అజయ్ దేవగన్ కనిపించేది కొద్దీ సేపే అయినప్పటికీ సినిమాలో ఆ పాత్రకు సంబందించిన ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుందని టాక్ వస్తోంది. దర్శకుడు రాజమౌళి హీరోల స్టార్ డమ్ ని దృష్టిలో ఉంచుకొని యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నాడు. సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.