తెలుగు బుల్లితెరపై కామెడీ షోలు నెలకోటి పుట్టుకొస్తున్నాయి. అయితే అందులో జబర్దస్త్ మాత్రమే ఎక్కువగా క్లిక్కవుతోంది. ఏళ్ళు గడుస్తున్నా షో రేటింగ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఆ మధ్య క్రేజ్ తగ్గుతుంది అనే సమయంలో నాగబాబు బయటకు రావడం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఇక రేటింగ్ మళ్ళీ పడిపోతుందేమో అనే టాక్ వచ్చింది.

పైగా నాగబాబు తో పాటు మరికొంత మంది కేడియన్స్ అదిరింది షోకి షిఫ్ట్ అయ్యారు. మొదట ఈ షో కూడా బాగానే క్లిక్ అయ్యింది. ముఖ్యంగా యూ ట్యూబ్ లో మంచి వ్యూవ్స్ వచ్చాయి. ఇక మరోవైపు రోజా మాత్రం తన క్రేజ్ తో షోకి మంచి రేటింగ్ అందించే ప్రయత్నం చేశారు. ఎక్కడా తగ్గకుండా జబర్దస్త్ అదే ఫ్లోలో నడుస్తోంది. టిఆర్పి ఇటీవల భారీగా పెరగడం మొదలైంది.  ఇక అదిరింది మాత్రం టీఆర్పీ లో ఇటీవల బాగా వెనకబడింది.

జబర్దస్త్ రోజా దెబ్బతో నాగబాబుకి అదిరింది అనే కామెంట్స్ వస్తున్నాయి. ఆరెంజ్ డిజాస్టర్ అనంతరం షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మంచి ఆదాయాన్ని అందుకున్న నాగబాబు ఆఫర్స్ కూడా అందుకున్నారు. కానీ కొన్ని మనస్పర్థల కారణంగా నాగబాబు ఆ సంస్థ నుంచి తప్పుకోవడంతో ఆ న్యూస్ అందరిని షాక్ కి గురి చేసింది. ఇక జబర్దస్త్ కి పోటీగా వచ్చిన అదిరింది పెద్దగా క్లిక్ అవ్వడం లేదు. మరి నాగబాబు షో కోసం మున్ముందు ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.