జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి దాదాపు ఏడేళ్లుగా జడ్జ్ గా కొనసాగిన రోజా.. నాగబాబు తప్పుకున్నా తన క్రేజ్ తో షోకి మంచి కలరింగ్ ఇస్తోంది. గత కొన్ని నెలల కిందట నాగబాబు ఆ షోకు ఎండ్ కార్డ్ పెట్టేసిన విషయం తెలిసిందే. నాగబాబు ఉన్నప్పుడు మెగా హీరోలపై పాజిటివ్ పంచ్ లు పడేవి. కానీ రోజా ఆధ్వర్యంలో ఈ మధ్య పవన్ పై నెగిటివ్ పంచ్ లు పేలుతున్నాయా అనే కామెంట్స్ వస్తున్నాయి.

రీసెంట్ గా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో బెత్తం కాన్సెప్ట్ గట్టిగానే పేలింది. సుడిగాలి సుధీర్ టీమ్ బెత్తం వారి నిలయం అంటూ స్కిట్ చేశారు. అందులో రోజా కూడా తన ప్రమేయం ఉండేలా బెత్తం పట్టుకొని కంటెస్టెంట్స్ పై ఎగబడ్డారు. గతంలో పవన్ కళ్యాణ్ దిశా ఘటనపై స్పందిస్తూ నిందితులను ఉరిశిక్ష వేయాల్సిన అవసరం లేదని తోలు ఊడేలా నాలుగు దెబ్బలు కొడితే చాలని కామెంట్ చేశారు.  అప్పట్లో పవన్ పై చాలా విమర్శలు వచ్చాయి. దానిని ఉద్దేశిస్తూ ఇప్పుడు జబర్దస్త్ లో బెత్తం స్కిట్ ను చేయించారా? అనే కామెంట్స్ వస్తున్నాయి.

ఇక రోజా కూడా బెత్తం పట్టుకొని హడావుడి చేయడం తో ప్రోమో సోషల్ మీడియాలో మరీంత వైరల్ అయ్యింది. మరీ ఫుల్ ఎపిసోడ్ లో పంచ్ లు ఇంకెంతగా పేలతాయో చూడాలి. ఇక నాగబాబు వెళ్లిన అనంతరం పలువురు సినీ ఆర్టిస్టులు జడ్జ్ లుగా కొనసాగుతూ వస్తున్నారు. నాగబాబు వెళ్లినా కూడా షోపై పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది.