Asianet News TeluguAsianet News Telugu

#Salaar లో గెస్ట్ రోల్ ఆ హీరో? నిజమైతే మామూలుగా ఉండదు

 ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో సూపర్ బిజీగా ఉంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 22 విడుదల కానుంది. 

Rocky Bhai cameo in #Salaar has recently become the talk of the town jsp
Author
First Published Nov 14, 2023, 1:33 PM IST

ఇప్పుడు ఏ పెద్ద సినిమాలో చూసినా మరో స్టార్ హీరో వచ్చి గెస్ట్ రోల్ చేసి పోతున్నాడు. హిందీలో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు సౌత్ సినిమాల్లోనూ నడుస్తోంది. సినిమా రిలీజ్ కు ముందు ఫలానా హీరో ఈ సినిమాలో గెస్ట్ గా కనిపిస్తున్నారట అంటూ మీడియాలో వార్తలు వస్తాయి. దాంతో ఆ హీరో అభిమానులంతా నిజంగానే ఆ హీరో ఆ సినిమాలో ఎక్కడైనా కనిపిస్తాడేమో అని ఆశతో థియేటర్స్ కు పరుగెడతారు. రీసెంట్ గా టైగర్ 3 లో ఎన్టీఆర్ కనపడబోతున్నారనే ప్రచారం నడిచింది. అందుకుముందు లియో చిత్రంలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడన్నారు. ఇప్పుడు సలార్ సినిమా వంతు వచ్చింది. 
 
ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారనటంలో సందేహం లేదు. ప్రభాస్ ఈ సినిమాపై బాగా నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ ఏడాది ఆదిపురుష్ తో  ప్రభాస్ పెద్ద డిజాస్టర్  అందుకోవడంతో అభిమానులందరూ.. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇంకా  ఈ చిత్రం నిమిత్తం కొన్ని రీ షూట్ లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అద్బుతమైన అవుట్ ఫుట్ తో కేజీఎఫ్ ని మించిన హిట్ ఇవ్వాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ గత చిత్రం కేజీఎఫ్ హీరో యష్ కనపడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే రాఖీ భాయ్ ఈ సినిమాలో కీలకమైన రోల్ లో కనపడబోతున్నారట. ఈ విషయం ఇప్పుడు కన్నడ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు యష్ అభిమానులంతా ఈ సినిమా కోసం రిలీజ్ రోజు క్యూలు కడతారు.   ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో సూపర్ బిజీగా ఉంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 22 విడుదల కానుంది.  ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 1న రాత్రి 7.19 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. 

మరో ప్రక్క  బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు మాత్రం తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అందుకు కారణం ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్. అలాగే ఆయన క్రేజీ కాంబినేషన్స్.  ఈ క్రమంలో ఈ డిసెంబర్ లో రాబోతున్న ప్రభాస్ సలార్ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి.   ఈ సినిమాకి కేజీఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో, ఖచ్చితంగా ఈ చిత్రం తప్పకుండా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్మకంతో ఉంది ట్రేడ్. దాంతో డిసెంబర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా షారుక్ ఖాన్ దుంకి సినిమాతో పోటీ పడాల్సి ఉన్నా కూడా లెక్క చేయటం లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ కుమ్మేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios