రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు భద్రతా నిబంధనలను పాటించాలని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉద్బోధించారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలను సోమవారం నాడు ఆయన నెక్లెస్ రోడ్డు ఐమాక్స్ పక్కనున్న హెచ్‌ఎండీఏ మైదానంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా పువ్వాడ హెల్మెట్ ధరించి బైక్ ని నడిపారు. ఆయనతో పాటే బైక్ పై టాలీవుడ్ బ్యూటీ ఈషా రెబ్బ ప్రయాణించారు. నిబంధనలను పాటించకపోవడం వలనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు.

నడుము అందాలతో కట్టిపడేస్తున్న బుట్టబొమ్మ... చూసి తట్టుకోవడం కష్టమే!

హెల్మెట్ ని తప్పనిసరిగా ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలని, కారు.. ఇతర వాహనాల్లో సీట్ బెల్టు పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ సోమేశ్ కుమార్‌, రోడ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కృష్ణ ప్రసాద్, రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీల్‌ శర్మ, కమిషనర్‌ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.