సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి లోని రాణే బ్రేక్ లైనింగ్ కంపెనీ వద్ద రాజీవ్ రహదారి పై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెరాస ఎమ్యెల్యే  రసమయి బలకిషన్ ప్రొడ్యూస్ చేసిన తుపాకీ రాముడు సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రేజ్ఞాపూర్ సమీపంలో ప్రమాదమా చోటుచేసుకుంది.

7 మంది తో ప్రయాణిస్తున్న మహీంద్రా జాయిలో వాహనం రాణే కంపెనీ వద్ద రాగానే అదుపు తప్పి రోడ్డు పై ఆగి ఉన్న లారీ ని ఢీకొనడంతో వేగురు పల్లి గ్రామానికి చెందిన మల్లేశం , ప్రభాకర్ రెడ్డి , జనార్దన్ రెడ్డి లు అక్కడికక్కడే మృతి చెందగా , పుల్లయ్య , గోవర్ధన్ , దేవేందర్ రెడ్డి , శంకర్ లకు గాయాలయ్యాయి. వీళ్లంతా కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం లోని వేగురుపల్లి గ్రామస్తులు, మరణించిన వారిలో మల్లేశం వేగురు పల్లి గ్రామ సర్పంచ్ గా గుర్తించారు, వీరంతా తెరాస పార్టీ కార్యకర్తలు. 

"