బాలీవుడ్‌ దిగ్గజ నటుడు సంజయ్‌ దత్‌ మరణంతో సినీ పరిశ్రమ అంతా శోక సంద్రంలో మునిగిపోయింది. దశాబ్దాలుగా ఎంతో మందితో కలిసి పనిచేసిన రిషి కపూర్‌ను తలుచుకొని ప్రతీ ఒక్కరు భావోద్వేగానికి లోనవుతున్నారు. తమ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్‌ సీనియర్ హీరో సంజయ్ దత్‌ కూడా రిషి కపూర్‌తో తన అనుబంధాన్ని పంచుకున్నాడు.

`డియర్ చింటూ సర్‌, మీరు నాకు ఎప్పుడు ఓ ఇన్సిపిరేషన్‌. నా జీవితంలో అలాగే నా కెరీర్‌లో కూడా. జీవితాన్ని సంపూర్ణంగా ఎలా అనుభవించాలో నాకు మీరే నేర్పించారు. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మీరు నాతో ఉన్నారు. మీతో కలిసి ఎన్నో సినిమాలో నటించే గౌరవం నాకు దక్కింది. ఆ సమయంలో మీరు నాకు ఎంతో నేర్పించారు. మీరు చాలా కాలంగా క్యాన్సర్‌తో పొరాడుతున్నా.. ఎప్పుడు మాకు ఆ విషయం తెలిసేది కాదు. న్యూయార్క్‌లో మీతో మాట్లాడినప్పుడు కూడా మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు.

కొన్ని నెలల క్రితం మీ ఇంట్లో డిన్నర్ కు వచ్చినప్పుడు కూడా మీరు నా పట్ల ఎంతో ప్రేమ చూపించారు. ఈ రోజు నా జీవితంలో అత్యంత విషాదకరమైన రోజు.  ఈ రోజు నేను ఓ కుటుంబ సభ్యుణ్ని, ఓ స్నేహితుడిని, ఓ అన్నను అలాగే నాకు జీవితంతో పోరాడటం నేర్పిన ఓ గురువును కోల్పోయాను. మీరు స్వర్గంలోనూ ఆనందంగా ఉండాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటా` అంటూ తన భావోద్వేగాన్ని పంచుకున్నాడు సంజయ్‌ దత్‌.