తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన వెంటనే రిథిమా భారత హోం శాఖను ముంబై వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా గత రాత్రి కోరారు. తాను చార్టెడ్‌ ఫ్లైట్‌లో వెళతానని అందుకు పర్మిషన్ ఇప్పించాల్సిందిగా ఆమె అధికారులను కోరారు.

బాలీవుడ్‌ లెజెండరీ యాక్టర్ రిషి కపూర్ ఈ రోజు ఉదయం 8 గంటల 45 నిమిషాలకు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసింది. అయితే ఆరోగ్య పరిస్థితి నిన్న రాత్రికే పూర్తిగా విషమించటంతో ఆ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో ఆయన కూతురు రిథిమా కపూర్ తండ్రి ఆఖరి చూపుకోసం బయలు దేరారు. అయితే ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉంటున్నారు.

తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన వెంటనే రిథిమా భారత హోం శాఖను ముంబై వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా గత రాత్రి కోరారు. తాను చార్టెడ్‌ ఫ్లైట్‌లో వెళతానని అందుకు పర్మిషన్ ఇప్పించాల్సిందిగా ఆమె అధికారులను కోరారు. అయితే విమాన ప్రయాణానికి అనుమతి కావాలంటే హోం మినిస్టర్‌ అమిత్‌ షా మాత్రమే ఇవ్వగలరని ఇతర ఉద్యోగులకు ఆ అధికారాలు లేవని తెలపటంతో ఆమె రోడ్డు మార్గంలోనే బయలు దేరారు.

ఢిల్లీ ఐదుగురు వ్యక్తులు ముంబై వెళ్లేందుకు కేంద్ర హోం శాఖ అనుమతి ఇచ్చింది. అయితే రోడ్డు మార్గంలో వెళ్లాలంటే దాదాపు 1400 కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకు కనీసం 24 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అంటే ఈ రోజు సాయంత్రానికి గానీ రిథిమా ముంబై చేరుకునే అవకాశం లేదు. ఇప్పటి తండ్రి మరణించిన వార్త విని కన్నీటి పర్యంతమైన రిథిమా తన బాధను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.

View post on Instagram