బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రోజుకో కొత్త ట్విస్టుతో, నూతన ఆరోపణలతో అసలు సుశాంత్ ది హత్యా, ఆత్మహత్యా అనేది అర్థం కాకుండా ప్రజలు తలలుబాదుకుంటున్నారు. 

సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి కేక్ సింగ్ బీహార్ లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. చీటింగ్ నుంచి మొదలుకొని ఆత్మహత్యకు ప్రేరేపించింది అనే అనేక సెక్షన్ల కింద బీహార్ పోలీసులు కేసు నమోదు చేసారు. 

ఈ జరుగుతున్న ఘటనలపై ఎట్టకేలకు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి స్పందించింది. కన్నీటి పర్యంతమవుతూ 'ఎప్పటికైనా గెలుపు న్యాయనిదే' అంటూ వీడియో విడుదల చేసింది. 

భగవంతుడిపై, న్యాయ వ్యవస్థపై ,అపారమైన నమ్మకం ఉందని, తనకు న్యాయం జరుగుతుందని విశ్వశిస్తున్నట్టుగా తెలిపింది రియా చక్రవర్తి. తన గురించి మీడియాలో అనేక నీచమైన ఆరోపణలు చేస్తున్నప్పటికీ.... తన లాయర్ల సలహా మేరకు, విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఏమీ మాట్లాడడంలేదని ఆమె చేతులు కట్టుకొని, కన్నీరు కారుస్తూ తెలిపింది. సత్యమేవ జయతే, న్యాయం గెలుస్తుంది అంటూ ఆమె తన వీడియోను ముగించింది. 

రియా చక్రవర్తికి సంబంధించిన కొన్ని కామెంట్లు ఆన్ లైన్ లో వైరల్ అయిన నేపథ్యంలో ఆమె తరుపు లాయర్ ఈ వీడియోని విడుదల చేసారు. సుశాంత్ మరణం తరువాత నుంచి ఆమె బహిరంగంగా స్పందించడం ఇదే తొలిసారి. 

ఇకపోతే... సుశాంత్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్, సంచలన ఆరోపణలు చేసి పోలీస్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. గర్ల్‌ ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణంగానే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన పోలీసు కంప్లయింట్ కూడా ఇవ్వటం సంచలనంగా మారింది. 

రియా, సుశాంత్‌ను మానసికంగా వేదించిందని, అతని డబ్బు వాడుకుందని ఆయన కంప్లయింట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు సుశాంత్ అనారోగ్యానికి కూడా కారణం రియానే అని, తనని కుటుంబ సభ్యులను కూడా కలవకుండా రియా అడ్డుకుందని కేకే సింగ్ ఆరోపించారు. 

తాజాగా జేడీయూ నేత మహేశ్వర్‌ హజరీ కూడా రియా మీద ఇలాంటి ఆరోపణలే చేశారు. రియా ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌ అని, ఆమె విష కన్యలా వ్యవహరించిందని ఆయన తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. 

అంతేకాదు సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యే అని, దీనిపై పూర్తిగా స్థాయిలో విచారణ జరిపి అసలు దోషులను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సుశాంత్‌ కేసులు ముంబై పోలీసులు తీరు అనుమానాస్పదంగా ఉందన్న అభిమాప్రాయం వ్యక్తం చేశారు.