టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన చిత్రం 'శివ'. ఈ సినిమా విడుదలై నేటికి ముప్పై ఏళ్లు. 1989 అక్టోబర్ 5న ఈ సినిమా విడుదలైంది. నాగార్జున నటించిన ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. 

రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కెరీర్ లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోయింది. తొలి సినిమాతోనే తన సత్తా చాటిన వర్మ ఈ సినిమాకి ముప్పై ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. నాగార్జునని ట్యాగ్ చేస్తూ.. 'ఇవాళ మన ప్రియమైన బిడ్డ 30వ పుట్టినరోజు' అని ట్వీట్ చేశాడు.

ఈ సినిమాకి ఇలయరాజా సంగీతం మరో అసెట్ అనే చెప్పాలి. ఇప్పటికీ సినిమాలో పాటలు వినిపిస్తూనే ఉంటాయి. అంతే ఫ్రెష్ ఫీలింగ్ ని కలిగిస్తుంటాయి. ఇది ఇలా ఉండగా.. కొద్దిరోజుల క్రితం నాగార్జున, వర్మ కలిసి మరో సినిమా చేశారు. అదే 'ఆఫీసర్'.

వర్మకి ప్రస్తుతం క్రేజ్ తగ్గిందని తెలిసినప్పటికీ నాగార్జున 'శివ' లాంటి సినిమా ఇచ్చాడనే నమ్మకంతో సినిమాలో నటించాడు. కానీ 'ఆఫీసర్' కాస్త డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తరువాత నాగ్ కొంతకాలం గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం నాగార్జున 'బంగార్రాజు' సినిమా కోసం సిద్ధమవుతున్నాడు.