వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. సమాజంలో పెను ప్రకంపనలు సృష్టించిన అంశాలని వర్మ తన సినిమా కథలుగా ఎంచుకుంటారు. ప్రస్తుతం వర్మ దిశ సంఘటనపై సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. 

హైదరాబాద్ లో జరిగిన దిశ అత్యాచారం, హత్య సంఘటన దేశవ్యాప్తంగా విషాదం నెలకొల్పింది. నలుగురు దోషులు దిశని అత్యంత కిరాతకంగా రేప్ చేసి సజీవదహనం చేశారు. ఈ సంఘటన ప్రతి ఒక్కరి హృదయాల్ని కలచి వేసింది. గత ఏడాది ఈ సంఘటన జరగగా.. కొద్దిరోజులకే నిందితులని పోలీసులు అరెస్ట్ చేయడం..  ఎన్కౌంటర్ చేయడం జరిగింది. 

ఈ అంశాన్ని ఆధారంగా తీసుకుని తాను ఎమోషనల్ గా సినిమా తెరకెక్కించబోతున్నట్లు వర్మ ప్రకటించారు. అనుకున్నదే ఆలస్యం వర్మ ఈ చిత్రంపై వర్క్ ప్రారంభించేశారు. కొన్ని రోజుల క్రితం వర్మ నిందితులలో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకని కలసిన సంగతి తెలిసిందే. ఆమెని అడిగి చెన్నకేశవులు గురించి వర్మ అనేక విషయాలు తెలుసుకున్నారు. 

శృతి హాసన్ స్టన్నింగ్ ఫొటోస్.. సెక్సీ చూపులతో సెగలు

అదే విధంగా వర్మ శంషాబాద్ ఏసిపిని కూడా కలిశారు. ఆయన్ని అడిగి దిశ కేసు వివరాలు తెలుసుకున్నారు. దిశ సంఘటనపై సినిమా తెరకెక్కించేందుకు తనకు ఎవరి అనుమతి కూడా అవసరం లేదని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దిశ చిత్ర షూటింగ్.. ఆ ఘోరం జరిగిన చటాన్ పల్లి ప్రాంతంలో ప్రారంభమైంది. 

ప్రస్తుతం దిశని కిడ్నాప్ చేయడం.. అత్యాచారం, హత్య, సజీవదహనానికి సంబంధించిన సన్నివేశాలని ఆ ప్రాంతంలో వర్మ చిత్రీకరిస్తునట్లు తెలుస్తోంది. వర్మ తన క్రియేటివిటీతో ఈ ఘోర సంఘటనని ఎలా చూపించనున్నాడో మరి.