విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో స్పెషల్ మూవీతో బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సాధరణంగా వర్మ ఎంచుకునే కథలు వివాదాలకు దగ్గరగా ఉంటాయన్నది అందరికి తెలిసిన విషయమే. సినిమాపై బజ్ పెరగాలంటే ఈ రోజుల్లో తప్పనిసరిగా ఎదో ఒక కాంట్రవర్సీ ఉండాలన్నది ఆయన సిద్ధాంతం.  

ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేస్తున్న ఆర్జీవీ పనిలో పనిగా తన పాత సినిమాను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఎంటర్‌ ద గర్ల్‌ డ్రాగన్‌’ సినిమాతో వర్మ ట్విట్టర్ వేదికగా హడావుడి మొదలుపెట్టాడు ఇండియాలోనే ఇది తొలి మార్షల్‌ ఆర్ట్స్‌ చిత్రమని చెబుతూ.. తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సినిమా టీజర్‌ను బ్రూస్‌లీ 80వ జయంతి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు చెప్పాడు.

బుధవారం మధ్యాహ్నం 3.12 గంటలకు విడుదల చేయబోతున్నట్టు వర్మ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ఇండో-చైనా సంయుక్త ప్రోడక్షన్‌ లో అంతర్జాతీయ ట్రైలర్‌ ను బ్రూస్‌ లీ సొంత పట్టణమైన ఫోషన్‌ సిటీలో డిసెంబర్‌ 13న విడుదల రిలీజ్ చేయనున్నారట. చైనీస్‌ నిర్మాతతో ఒప్పందంపై సంతకం చేస్తున్న ఫొటోను కూడా ఆర్జీవీ సోషల మీడియాలో పోస్ట్ చేశారు. చైనాకు చెందిన  బ్రూస్‌ లీ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతూ అతనిపై ఉన్న అభిమానాన్ని ఒక నోట్ ద్వారా వర్మ తెలియజేశారు.

'సైరా' చూడరని చిరుకి ముందే చెప్పా కానీ.. నటుడు గిరిబాబు కామెంట్స్!