ట్రంప్ పర్యటనపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ట్విట్టర్ వేదికగా ట్రంప్ పర్యటనపై సెటైర్లు వేశారు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకి వచ్చిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన 'నమస్తే ట్రంప్' అనే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

ఇదిలా ఉండగా.. ట్రంప్ పర్యటనపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ట్విట్టర్ వేదికగా ట్రంప్ పర్యటనపై సెటైర్లు వేశారు. ట్రంప్ ని ఇండియాకి ఆహ్వానించడానికి వేలకోట్లు ఖర్చు చేశామని.. కానీ ప్రధాని నరేంద్ర మోదీని అమెరికాకు స్వాగతించడానికి అమెరికన్లు వేల రూపాయలైన ఖర్చు చేస్తారా..? అది అమెరికా.. భారత్ కాదు అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.

బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి.. హాట్ క్లీవేజ్ షోతో రచ్చ!

అలానే ట్రంప్‌ ఇండియాకు రావడానికి ఒకటే కారణమని.. తను ఇండియా వస్తున్నాడంటే ఎంత మంది అతన్ని చూడటానికి వస్తారో అని ఆసక్తిగా ఉన్నాడని.. ఎందుకంటే దీనిని ఆయన చనిపోయే వరకు గొప్పగా చెప్పుకోవచ్చని అన్నారు. తన కోసం 10 మిలియన్ల మంది రావొచ్చు.. కానీ ట్రంప్‌ 15 మిలియన్ల జనాలు వచ్చారని అబద్ధం చెబుతాడని మరో ట్వీట్ చేశాడు.

''ఏ భారతీయుడైన తమ సొంత సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తారని నేను అనుకోవడం లేదు. అలాంటిది వేరే దేశం నుంచి వచ్చిన వాళ్లు ఆసక్తిగా చూస్తారని ఆశించడం సరైనది కాదు. దీని కంటే ఓ బాలీవుడ్‌ నైట్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేయడం ఉత్తమం'' అంటూ పంచ్ లు వేశారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…