సరైన టైటిల్స్ పెట్టడంతోనే సినిమాకు సగం క్రేజ్ వచ్చేస్తుంది. అందుకే దర్శక,నిర్మాతలు టైటిల్ విషయంలో చాలా కసరత్తు చేసి,ఫైనలైజ్ చేస్తూంటారు. ముఖ్యంగా బాలయ్య సినిమాలకు టైటిల్స్ పరవ్ ఫుల్ గా ఉండేలా చూసుకుంటారు. అయితే ప్రతీసారి విభిన్నంగా, శక్తివంతంగా కనపడే టైటిల్స్ ఎక్కుడ దొరుకుతాయి. అలాంటప్పుడు గతంలో వచ్చిన టైటిల్స్ ని రిపీట్ చేస్తూంటారు.  ఇప్పుడు బాలయ్య తాజా చిత్రానికి అలాంటి టైటిల్ నే ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఆ టైటిల్ గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం టైటిల్ అని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటిస్తోన్న 105వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.  హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సీ క‌ళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గ‌తంలో  సీ క‌ళ్యాణ్‌, కేఎస్‌.ర‌వికుమార్, బాల‌య్య కాంబోలో వ‌చ్చిన జై సింహా సినిమా 2018 సంక్రాంతికి వ‌చ్చి హిట్ అవటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.  

ఈ సినిమాకు కథ, కథనం అన్ని అద్బుతంగా కుదిరినా టైటిల్ దగ్గర మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారట. మొదట్లో ఈ సినిమాకి మొదట్లో ‘రూలర్’ అనే టైటిల్ నిర్ణయించినట్టు  వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులంతా దాన్నే కన్ఫర్మ్ అనుకున్నారు. అయితే ఇప్పుడు వేరొక టైటిల్ ప్రచారంలోకి వ‌చ్చింది. ఈ సినిమాకు ఇప్పుడు కొత్త‌గా ‘డిపార్టమెంట్’ అన్న టైటిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇదే టైటిల్ తో గతంలో రానా హీరోగా ఓ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ రూపొందించారు. అయితే మంచి టైటిల్ అని , ఖచ్చితంగా క్రేజ్ వస్తుందని అంటున్నారు.

 మరో ప్రక్క‘జడ్జిమెంట్’ అనే టైటిల్ సైతం ప్రచారంలో ఉంది. ఇక ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు సి.రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌ పై సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.