పశ్చిమ బెంగాల్ లో లాక్ డౌన్ కాలంలో మద్యం డోర్ డెలివరీ చేస్తామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం(దీనిపైనా ఇంకా ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి స్పష్టత రాలేదు), వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అదే అదునుగా చూసి తెలంగాణ మంత్రి కేటీఆర్ ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారిని టాగ్ చేస్తూ మాకు కూడా ఇలా లిక్కర్ హోమ్ డెలివరీ ఇవ్వొచ్చుకదా అని వ్యంగ్యంగా ట్వీట్ చేసారు. 

#AskKTR లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  ఓ ప్రశ్న వేశారు. ‘‘మీకు నాదో విన్నపం. ఎవరైతే బోర్‌గా ఫీలవుతూ జుట్టు పీక్కుంటున్నారో, చిన్నపిల్లల్లాగా ఏడుస్తున్నారో, మెంటల్ ఆస్పత్రుల్లో చేరుతున్నారో, ఫ్రస్టేషన్‌తో భార్యలను కొడుతున్నారో వీరి కోసం మమతా బెనర్జీ లాంటి పెద్ద మనస్సు ఉండాలి. అలాంటి పద్ధతినే ఇక్కడ కూడా ప్రవేశపెట్టండి’’ అని వర్మ ట్వీట్ చేశారు. 

రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్‌కు వెంటనే మంత్రి కేటీఆర్‌ సరదాగా బదులిచ్చారు. ‘రామూ గారూ.. హెయిర్‌ కట్‌ గురించే అడుగుతున్నారు కదా’ అంటూ చమత్కరించారు. ఆలోచిస్తున్న ఓ ఇమోజీని కూడా జత చేశారు. మంత్రి ‘ఆస్క్ కేటీఆర్ మొదలు పెట్టిన వెంటనే మొదటి ట్వీట్ ఇదే కావడం విశేషం. 

కేటీఆర్ కౌంటర్ ని వర్మ ఆలస్యంగా చూసుకున్నాడట. ఆ ట్వీట్ కి స్పందిస్తూ...కేటీఆర్ సెన్స్ అఫ్ హ్యూమర్ నచ్చిందని, ఆయన బలమైన పంచ్ కి ముక్కు ఎర్రగా అయిపోయిందని అన్నాడు. కానీ తెరాస ప్రభుత్వం చేస్తున్న పనులు మాత్రం తనకు నచ్చాయని చెప్పుకొచ్చాడు వర్మ. గతంలోనుంచి కూడా వర్మ తెరాస ప్రభుత్వానికి పెద్ద ఫ్యాన్ అని సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాడు.