వివాదభరితమైన అంశాలతో వర్మ ఇటీవల ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు. వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తాజాగా వర్మ ఏపీలోని రాజకీయ పరిస్థితులపై 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే చిత్రాన్ని తెరక్కిస్తున్నాడు. 

ఈ చిత్రంలో వర్మ 2019 ఎన్నికల తర్వాత ఏపీలో నెలకొన్న పరిస్థితులని హైలైట్ చేస్తున్నాడు. వైఎస్ జగన్ పాత్రని హైలైట్ చేస్తూ.. మిగిలిన ప్రధాన పార్టీల నేతలని వర్మ టార్గెట్ చేస్తున్నట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్ లో స్పష్టమైంది. 

చంద్రబాబు, నారాలోకేష్, పవన్ కళ్యాణ్ పై వర్మ తన ట్విట్టర్ లో వివాదాస్పద పోస్ట్ లు పెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వర్మ వంగవీటి రంగ తనయుడు రాధాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంలో వంగవీటి రాధా పాత్ర ఇదే అంటూ ఓ ఫోటో పోస్ట్ చేశాడు. 

సిట్ అధికారి సుందరి వంగవీటి రాధాని విచారణ చేస్తున్నారు.. సారీ సారీ వంగవీటి కాదు.. గంగవీటి భవాని.. కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్రంలో ఓ దృశ్యం అని వర్మ ట్వీట్ చేశాడు. ఇప్పుడే వర్మ ఇన్ని వివాదాలు సృష్టిస్తుంటే.. ఈ చిత్రం విడుదలయ్యాక ఇంకెంత హాట్ టాపిక్ అవుతుందో మరి.