టాలీవుడ్ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరొకసారి కరోనా వైరస్ గురించి ప్రస్తావిస్తూ ఎవరు ఊహించని సెటైర్ వేశాడు. ట్రేండింగ్ టాపిక్స్ పై ఏదో ఒక సెటైర్ వేసే వర్మ గత కొన్నిరోజులుగా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్న కరోనా పై కామెంట్స్ చేస్తూ వస్తున్నాడు.

ప్రపంచ దేశాలని వణికిస్తున్న కరోనా పై సెలబ్రెటీలంతా స్పందిస్తూ.. తగిన జాగ్రత్తలు చెబుతున్నారు.  అయితే వర్మ మాత్రం ప్రపంచాన్ని కాపాడే హీరోలంతా ఎక్కడ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. విలన్ లా భయపెడుతున్న కరోనా ని ఎదుర్కోవాల్సిన హీరోలంతా ఎక్కడికి వెళ్లారు. స్పైడర్ మ్యాన్ - సూపర్ మ్యాన్ - బ్యాట్ మ్యాన్ వంటి హీరోలు ఎక్కడ ఉన్నారు. వేరే గ్రహానికి వెళ్లారని మాత్రం చెప్పకండి అంటూ సెటైర్ వేశాడు.

ఇటీవల కొంతమంది కరొనపై జోకులు, సెటైర్స్ వేస్తే.. అదొక వివాదస్పదంగా మారింది.  కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం అవేమి పట్టించుకోకుండా ఎదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం దిశ ఘటన ఆధారంగా సినిమాని సిద్ధం చేస్తున్న రామ్ గోపాల్ వర్మ త్వరలోనే సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ లుక్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. మరీ ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.