శ్రీముఖి, చిరంజీవి కు మధ్య వచ్చే ఖుషీ సినిమా నడుము సీన్ ప్యారిడీ హాట్ టాపిక్ గా మారింది.
ఈ సంవత్సరం సంక్రాంతికి 'వాల్తేర్ వీరయ్య'గా కనిపించి ఆకట్టుకున్న చిరంజీవి.. తన మాస్ స్టామినాను చూపించి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు 'భోళా శంకర్' ఆడియన్స్ ముందుకొచ్చారు. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ 'వేదాళం'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందు నుంచి శ్రీముఖి, చిరంజీవి కు మధ్య వచ్చే ఖుషీ సినిమా నడుము సీన్ ప్యారిడీ హాట్ టాపిక్ గా మారింది. పవన్ అభిమానులు సైతం ఆ సీన్ ఎలా తెరపై పండిందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాలో ఆ సీన్ ఎలా పండిందో చూద్దాం.
ఈ సినిమాలో ఓ సీన్ లో చిరంజీవి, శ్రీముఖి కూర్చుని ఉంటారు. చిరంజీవి గ్లాసులో మంచినీళ్లు తాగుతూ ఉంటారు. ప్రక్కనే కూర్చున్న శ్రీముఖి దగ్గర ఉన్న ఫ్యాన్ గాలికి నడుము దగ్గర చీర తొలిగి బొడ్డు కనిపిస్తుంది. చిరంజీవి అటే చూస్తాడు. ఆమె సర్దుకుంటుంది. మళ్లీ గాలికి కదులుతుంది. చిరంజీవి మళ్లీ సర్దుకుంటాడు. శ్రీముఖి సీరియస్ గా చూస్తూంటే ..ఏమీ తెలియనట్లు చేతిలో ఉన్న గ్లాసు ప్రక్కన పెట్టి డబ్బులు లెక్కపెడుతూంటాడు. భోళాజీ అని పిలుస్తుంది. పట్టించుకోనట్లు డబ్బులు లెక్కపెడుతూంటాడు. క్యా అంటాడు.
నువ్వు చూసినవ్ అంటుంది. అప్పుడు చిరంజీవి ..చూసినా ..లేకపోతే లెక్కలు తప్పుతయి కదా అంటాడు. లెక్కలు గురించి కాదు ..నీ లుక్కులు గురించి మాట్లాడుతున్నాను. నువ్వు నా నడుము చూసినవ్ అంటాడు. నీ నడుమా నేనా అన్నట్లు ఎక్సప్రెషన్ ఇస్తారు చిరంజీవి. ఆమె సీరియస్ గా చూస్తుంటే ..నో ...కళ్లు ..నీ ఒంట్లో భాగమే..ముక్కు నీ ఒంట్లో భాగమే..నడుము నీ ఒంట్లో భాగమే.. అవి చూస్తే తప్పు లేదు కానీ నడుము చూస్తే తప్పా... ఆ..ఆ..ఆ అంటూ పవన్ కళ్యాణ్ ని అనుకరిస్తూ డైలాగు చెప్తారు.
పవన్ కల్యాణ్‌ని ఇమిటేట్ చేయడం, ముఖ్యంగా శ్రీముఖితో కలిసి చేసిన 'ఖుషి' నడుము సీన్ అభిమానులను నవ్వించలేకపోయిందని చెప్పాలి. అయితే సీన్ ఎలా ఉన్నా 'ఖుషి' నడుము సీన్ స్పూఫ్ వచ్చిన సమయంలో థియేటర్లలో అరుపులు, కేకలు మాత్రం పవన్ అభిమానుల నుంచి వినిపించాయి. ఇక ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో గ్యాంగ్‌స్టర్ బోళాగా చిరంజీవి కనిపించిన తీరు, ఆయన తనదైన శైలిలో పండించిన కామెడీ అక్కడక్కడా ఫరవాలేదనిపిస్తుంది. కీర్తి ఇంట్లో శ్రీముఖి, మురళీశర్మ, తాగుబోత రమేశ్, గెటప్ శ్రీను, బిత్తిరి సత్తి తదితర గ్యాంగ్‌తో కలిసి చిరంజీవి చేసిన సీన్స్ కొన్ని మాత్రమే నవ్విస్తాయి.