సీనియర్ నటీమణి, దర్శకురాలు రేణు దేశాయ్ ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఆమె మళ్ళీ నటనవైపు అడుగులు వేస్తున్నట్లు టాక్ వస్తోన్న విషయం తెలిసిందే. గతంలో ఒక సినిమాను డైరెక్ట్ చేసి కొత్తగా కెరీర్ ని స్టార్ట్ చేసిన రేణు దేశాయ్ మళ్ళీ నటిగా కూడా సరికొత్త కెరీర్ తో బిజీ కానున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా చూసి చూడంగానే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె పాల్గొన్న విషయం తెలిసిందే.

అసలైతే ఈ సినిమాలో మదర్ క్యారెక్టర్ కోసం నటించమని అడిగినప్పుడు తాను కొంత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పిన రేణు దేశాయ్ ఛాన్స్ మిస్ చేసుకుందట. అయితే ఆమె మాటలను బట్టి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ గా మరో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నట్లు చెప్పిన ఆమె తప్పకుండా యాక్టర్ గా కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం భూమిక - నదియా - టబు వంటి సీనియర్ హీరోయిన్స్ ప్రస్తుతం వారి సెకండ్ ఇన్నింగ్స్ తో బిజీ బిజీ యాక్టర్ గా మారుతున్నారు. అలాగే రెమ్యునరేషన్స్ కూడా దాదాపు హీరోయిన్స్ రేంజ్ లో అందుకుంటున్నారు. పాత్రలు క్లిక్కయితే తమిళ్ ఇండస్ట్రీల నుంచి కూడా మంచి ఆఫర్స్ అందుకుంటున్నారు. మరీ రేణు దేశాయ్ భవిష్యత్ లో ఎలాంటి ఆఫర్స్ అందుకుంటారో చూడాలి.