నటి రేణు దేశాయ్‌ ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటోంది. పవన్‌ నుంచి విడిపోయిన తరువాత కొంత కాలం సోషల్‌ మీడియాలో వచ్చే వేదింపుల విషయంలో అసహనం వ్యక్తం చేసిన ఆమె ఇటీవల అలాంటి వేదింపులు తగ్గటం, తాను కూడా వ్యక్తిగత జీవితంలో ఖాళీ సమయం దొరకటంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.

ప్రస్తుతం సెల్ఫ్‌ క్వారెంటైన్‌లో ఉంటున్న ఆమె గతంలో ఓ కార్యక్రమం కోసం వికారాబాద్‌లోని ఓ విలేజ్‌లో చిన్నారులతో కలిసి గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా తీసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేసి అభిమానులతో షేర్ చేసుకున్నారు.  చిన్నారులతో కలిసి బాబా ఫోజ్‌ ఇస్తూ సరదాగా గడిపిన ఆ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అంతేకాదు గ్రామంలోని ప్రకృతి, పశుపక్షాదులకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేసింది రేణు.

ఈ వీడియోతో పాటు `గ్రామీణ జీవితాన్ని మిస్‌ అవుతున్నా. నాకో బలమైన కోరిక ఉంది. నా పిల్లలు కాలేజీలలో చేరిన తరువాత ఓ మారుమూల గ్రామంలో ఫాం హౌజ్‌ నిర్మించుకొని అక్కడే సెటిల్‌ అవ్వాలని ఉంది. కూరగాయలు పండించుకుంటూ.. పది పిల్లులు, పది కుక్కలు ఇంకా ఎన్నో జంతువులు వాటితో పాటు లెక్కలేనని పుస్తకాలు ఉంటే. అది నిజంగా స్వర్గమే. అలాంటి రోజు త్వరలోనే వస్తుంది` అంటూ కామెంట్ చేసింది రేణు. అయితే ఈ పోస్ట్ చూసిన కొంత మంది కరోనా నేపథ్యంలో మీరు కూడా బయట తిరగకండి అంటూ ఓ ఉచిత సలహా ఇచ్చారు. అయితే వారికి ఇవన్నీ గతంలో తీసిన వీడియోలు అంటూ సమాధానమిచ్చింది రేణు.