టాలీవుడ్‌ చాలా కాలంగా హీరోయిన్‌గా కొనసాగుతున్నా ఇంకా స్టార్ ఇమేజ్‌ అందుకోలేకపోయినా బ్యూటీ రెజీనా. తన తో పాటు హీరోయిన్‌లుగా ఎంట్రీ ఇచ్చిన రకుల్‌ ప్రీత్ సింగ్, రాశీఖన్నాలు స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తుంటే రెజీనా మాత్రం మీడియం రేంజ్‌ హీరోలతోనే సరిపెట్టుకుంది. నటిగా ఎంత మంచి పేరున్నా భారీ చిత్రాల్లో నటించే ఛాన్స్ మాత్రం దక్కలేదు. ఇటీవల డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తున్న ఈ బ్యూటీ బోల్డ్ క్యారెక్టర్స్‌ కు కూడా సై అంటుంది.

కెరీర్‌ లో చాలా కాలం తరువాత ఇటీవల ఓ బిగ్ అందుకుంది ఈ బ్యూటీ. అది కూడా ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌తో కావటంతో మరింతగా ఖుషీ అవుతోంది. అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన ఎవరు సినిమాలో నెగెటివ్‌ రోల్‌ లో కనిపించింది రెజీనా. ఈ సినిమా సక్సెస్ కావటంతో పాటు రెజీనా పాత్రకు సూపర్బ్ రెస్సాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టి పెట్టింది ఈ భామ.

తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మనసులో మాట బయటపెట్టింది. తనకు బోల్డ్ క్యారెక్టర్స్‌ లో నటించాలనుందన్న రెజీనా, అవకాశం వస్తే రొమాంటిక్‌ సీన్స్‌, గ్లామర్స్‌ రోల్స్‌ కూడా చేయడానికి రెడీ అని చెప్పింది. ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు లేకపోయినా తమిళంలో వరుసగా సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ.