పుష్ప: ది రూల్‌’(Pushpa The Rule)ని  మేకర్స్‌ ప్రకటించిన దగ్గరి నుంచి అల్లు అర్జున్‌ అభిమానులు ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ల అంచనాలకు తగ్గట్టు ఈసారి మరిన్ని హంగులతో రూపొందించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.  


'పుష్ప... ది రైజ్‌’ (Pushpa The Rise) సాధించిన సక్సెస్ అంతాఇంతా కాదు. దాని సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘పుష్ప ది రూల్‌’ (Pushpa 2). ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అక్టోబర్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే షూటింగ్ ఓ వారం వాయిదా పడినట్లు సమాచారం. నవంబర్ 7 నుంచి మొదలెడుతున్నారు. అయితే అంతా రెడీ చేసుకున్నాక ఎందుకు వాయిదా పడింది అనే విషయమై సోషల్ మీడియాలో, ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చలు మొదలయ్యాయి. 

టీమ్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. లొకేషన్స్ విషయంలో సుకుమార్ తృప్తికరంగా లేరని, వేరే లొకేషన్ ని ఈ వారంలో ఫైనలైజ్ చేసి షూట్ మొదలెడతారని అంటున్నారు. అయితే అసలు కారణం ఇది కాదని, లాస్ట్ మినిట్ లో లొకేషన్స్ నచ్చలేదని సుకుమార్ వంటి డైరక్టర్ అనరని, వేరే కారణం ఉండివచ్చని ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే అల్లు అర్జున్, సుకుమార్..ఈ చిత్రం నిమిత్తం క్రిందటి వారమే ఫొటో షూట్ కంప్లీట్ చేసారు. 2024లో రిలీజ్ చేస్తారు కాబట్టి కూల్ గా సినిమాని పూర్తి చేసి, భారీగా ప్రమోషన్ చేసి వదలబోతున్నారని తెలుస్తోంది. 

పుష్ప: ది రూల్‌’(Pushpa The Rule)ని మేకర్స్‌ ప్రకటించిన దగ్గరి నుంచి అల్లు అర్జున్‌ అభిమానులు ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ల అంచనాలకు తగ్గట్టు ఈసారి మరిన్ని హంగులతో రూపొందించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. లొకేషన్లు, విజువల్‌ ఎఫెక్ట్స్, ఇతరత్రా సాంకేతికత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

అలాగే ఈ సినిమాకు థాయిలాండ్‌తో కనెక్షన్ ఉంటుందని, అక్కడ ఒక కీలకమైన ఎపిసోడ్ షూట్ చేయాలని ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ సీక్వెల్‌లో పుష్ప ఇంటర్నేషనల్ స్మగ్లర్‌గా అవతరించేలా చూపించనున్నారని, ఈ నేపథ్యంలోనే అతను థాయిలాండ్‌కి కూడా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయనున్నాడని అంటున్నారు. ఈ సీక్వెల్‌లో ఫస్ట్ పార్ట్‌లో ఉన్న నటీనటులే కొనసాగనున్నారు. వారితో పాటు మరికొన్ని కొత్త పాత్రల్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయనున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు.

ఈ నేపధ్యంలో ‘ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్‌ చేయడానికి సిద్ధమవుతున్న బన్నీ’ అంటూ అభిమానులు.. సోషల్‌మీడియాలో రకరకాల మీమ్స్‌ చేసి చిత్ర టీమ్ కి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది సీక్వెల్‌. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై సుకుమార్‌ టీం నుంచి త్వరలోనే క్లారిటీ రానుందన్నమాట.