Asianet News TeluguAsianet News Telugu

#Rajamouli:రాజమౌళిని బోయ్ కాట్ చేయండంటూ ట్రెండ్, కారణం


వివాదాలకు దూరంగా ఉండే రాజమోళిని బాయ్ కాట్ చేయమని పిలుపు ఇవ్వటం ఆశ్చర్యంగా మారింది. రాజమోళి వంటి స్టార్ డైరక్టర్ ని బాయ్ కాట్ చేయమనటం ఎంతవరకూ సమంజసం అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Reason behind Boycott SS Rajamouli
Author
First Published Aug 28, 2022, 3:47 PM IST


గత కొంతకాలంగా  సోషల్ మీడియా లో  బాయ్ కాట్ ట్రెండ్ పెరిగిపోయింది. చిన్న చిన్న కారణాలకే.. బాయ్ కాట్ అని ట్రెండ్ చేస్తున్నారు. అసలు ఈ బాయ్ కాట్ ట్రెండ్ అంటే బాలీవుడ్ భయపడే స్దితి వచ్చింది. వరస పెట్టి బాయ్ కాట్ చేస్తున్న సినిమాలకు మినిమం ఓపినింగ్స్ రావటం లేదు. సినిమా హిట్ కావాలంటే స్టోరీలో దమ్ముండాలి. లేదంటే సినిమాలో స్టార్ హీరో, హీరోయిన్, డైరెక్టర్ అయినా ఉండాలి. అప్పుడే సినిమాపై బజ్ పెరిగి కలెక్షన్స్ వస్తాయి ఎంత సినిమా వాళ్లు చెప్పినా అది జరగటం లేదు. ఈ ట్రెండ్ వల్ల సినిమా ఫలితాలు తారుమారు అవుతున్నాయి. తాజాగా ఈ బాయ్ కాట్ వేడి రాజమౌళికి తగిలింది. వివరాల్లోకి వెళితే...

అమిర్ ఖాన్ మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’ రిలీజ్ కంటే ముందే.. బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేశారు. దీంతో ప్రేక్షకులు సినిమా రిలీజ్ కి ముందే ఓ అంచనాకు వచ్చేశారు. అలా వచ్చేలా సోషల్ మీడియా యూజర్స్ చేశారు. దీనికి తోడు సినిమా స్క్రీన్ ప్లే కూడా కాస్త నెమ్మదిగా ఉండటం లాల్ సింగ్ చడ్డా సినిమాకు మైనస్ అయింది. ఫైనల్ గా ఆమిర్ సినిమాకు ఊహించనంత తక్కువ కలెక్షన్స్ వచ్చాయి.

ఆ తర్వాత తాప్సీ సినిమా కి అదే పరిస్దితి. తాజాగా లైగర్ మూవీకి ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. అందువల్లే పలువురు సోషల్ మీడియా యూజర్స్.. బాయ్ కాట్ లైగర్ అని ట్రెండ్ చేసారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ఈ బాయ్ కాట్ ట్రెండ్ రాజమౌళికి తగిలింది.

 సెప్టెంబరు 9న రిలీజ్ కావాల్సిన బ్రహ్మాస్త్ర చిత్రంలో రణ్ బీర్-ఆలియా భట్.. హీరోహీరోయిన్స్. దీంతో నెపోటిజమ్ అనే దానిపై విరక్తి చెందిన పలువురు బాలీవుడ్ ఆడియెన్స్.. విడుదలకు కొన్నిరోజుల ముందు నుంచే బాయ్ కాట్ ట్రెండ్ చేస్తున్నారు. #BoycottBrahmastra అంటున్నారు. దీంతో ఆడియెన్స్ కి.. చిత్రానికి వెళ్లాలని ఉన్నాసరే మానసికంగా ఆ సినిమాపై వస్తున్న బాయ్ కాట్ ట్రెండ్ చూసి వెళ్లడం మానుకుంటారు. ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ రాజమోళి ప్రమోషన్ చేస్తున్నారు. దాంతో రాజమౌళిని ఈ సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉండమని అడుగుతున్నారు. కానీ రాజమౌళి స్వయంగా ప్రమోషన్స్ ని పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాజమోళిని బ్యాన్ చెయ్యాలంటూ ..ఆ గ్యాంగ్ పిలుపు ఇచ్చింది.  మరి ఇధి ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios