Asianet News TeluguAsianet News Telugu

అనీల్ రావిపూడి ప్రాజెక్టు వాయిదా వేసిన బాలయ్య, కారణం ఏంటంటే..?

బాలకృష్ణ ప్రస్తుతం ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌2’ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరో ప్రక్క  గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా (#NBK107)  షెడ్యూల్‌  పెండింగ్ ఉంది. ‘అన్‌స్టాపబుల్‌ 2’ తో పాటుగా బాలకృష్ణ ఈ సినిమా షూటింగ్‌ మిగతా భాగాన్ని పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 

Reason behind Balakrishna, Anil Ravipudi film shoot postponed
Author
First Published Nov 4, 2022, 6:42 AM IST


స్టార్ డైరక్టర్  అనిల్‌ రావిపూడితో బాలకృష్ణ ఒక మాస్‌ ఎంటర్‌టైనర్‌కు సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. ఈ సినిమా షూటింగ్‌ నవంబర్‌లో మొదలయ్యే అవ్వాలి. దాంతో ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి.. ఈ చిత్రానికి సంబంధించి టీమ్‌ను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే అనుకోని విధంగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు లేటు అయ్యేటట్లు కనపడుతోంది. అందుకు కారణం ..గోపీచంద్ మలినేనితో బాలయ్య చేస్తున్న సినిమా షెడ్యూల్ ఇంకా పూర్తి కాకపోవటమే అని తెలుస్తోంది. దాంతో జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం అవుతుందంటున్నారు. సంక్రాంతి అయ్యాక ఈ సినిమా షూట్ ప్రారంభం కావచ్చు అని తెలుస్తోంది.  

బాలకృష్ణ ప్రస్తుతం ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌2’ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరో ప్రక్క  గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా (#NBK107)  షెడ్యూల్‌  పెండింగ్ ఉంది. ‘అన్‌స్టాపబుల్‌ 2’ తో పాటుగా బాలకృష్ణ ఈ సినిమా షూటింగ్‌ మిగతా భాగాన్ని పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 

అప్పటికి వీరసింహారెడ్డి చిత్రం రిలీజ్ అవుతుందని, అది బ్లాక్ బస్టర్ అవుతుంది కాబట్టి ఆ జోష్ లో షూట్ చాలా ఉత్సాహంగా జరుగుతుందని టీమ్ భావిస్తోంది.  తండ్రీకూతుళ్ల ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ ఇది. బాలయ్యకు జోడిగా ఓ బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుంటున్నారని , అలాగే విలన్ పాత్రకు కూడా ఓ బాలీవుడ్ నటుడుని తీసుకొచ్చి సినిమాకు క్రేజ్ తేబోతున్నారు. హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే  కూతురు పాత్రకిగాను ఆల్రెడీ శ్రీలీల ఎంపిక జరిగిపోయింది. ఈ సినిమాకి 'రామారావుగారు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది.  

ఈ సినిమాకు నేపథ్య సంగీతం తమన్‌ అందిస్తున్నారట. బాలకృష్ణను ఇప్పటి వరకు చూడని లుక్‌లో చూపిస్తానని గతంలోనే అనిల్ రావిపూడి చెప్పిన సంగతి తెలిసిందే. షూటింగ్‌ ప్రారంభానికి ముందే బాలకృష్ణ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజక్టును సాహూ గారాపాటి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. 2023 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. 

ఇక ఈ సినిమా తరువాత పరశురామ్ దర్శకత్వంలో బాలకృష్ణ చేసే అవకాశం ఉందని అంటున్నారు. గీతా ఆర్ట్స్ లోనే ఈ సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. 'ఊర్వశివో రాక్షసివో' ప్రీ రిలీజ్ ఈవెంటులోను పరశురామ్ మాటలు ఇందుకు మరింత బలాన్ని చేకూర్చాయి. మొత్తానికి బాలకృష్ణ కుర్ర హీరోలకంటే ఫాస్టుగా ప్రాజెక్టులను చక్కబెడుతూ ఉండటం విశేషం.
 

Follow Us:
Download App:
  • android
  • ios