Asianet News TeluguAsianet News Telugu

రివర్స్ గేర్ లో రీరిలీజ్ ట్రెండ్...షాకింగ్ రిజల్ట్

రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ మగధీర సినిమా తో పాటు..ఆరెంజ్ మూవీస్ ను రీ రిలీజ్ చేసారు.

Re release shocking trend Orange Blockbuster, Magadheera Flop jsp
Author
First Published Mar 28, 2024, 6:46 AM IST

రీరిలీజ్ ట్రెండ్ లో వరసపెట్టి తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే వాటి రిజల్ట్ మాత్రం ఆసక్తికరంగా మారింది. అప్పట్లో సూపర్ హిట్టైన చిత్రాలు ఇప్పుడు ఎవరు పట్టించుకోకపోవటం జరుగుతూంటే..అప్పట్లో ప్లాఫ్ సినిమాలు ఇప్పుడు రికార్డ్ లు క్రియేట్ చేస్తున్నాయి. బయిట ఆడని సినిమాలు ఓటిటిలలో ఆడుతున్న మాదిరిగా ఈ రిజల్ట్ లు వచ్చి సినీ జనాలకు సర్పైజ్ గా మారాయి. దాంతో ఏ సినిమా రీరిలీజ్ చేస్తే ఆడుతుందనే విషయం మిలియన్ డాలర్ క్వచ్చిన్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

స్టార్  హీరోల బర్త్ డే రోజున వారు నటించిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. పవన్ కల్యాణ్​ ‘ఖుషి’, ‘జల్సా’, మహేశ్ బాబు ‘పోకిరి’, వెంకటేశ్ ‘నారప్ప’, బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’ తదితర చిత్రాలు రీ–రిలీజ్ అయి అభిమానులను అలరించాయి. ఈ క్రమంలో ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ మగధీర సినిమా తో ఈ సంవత్సరం..లాస్ట్ ఇయిర్..ఆరెంజ్ మూవీస్ ను రీ రిలీజ్ చేసారు.

ఇండస్ట్రీ హిట్ గా మగధీర నిలిస్తే. ఇండస్ట్రీలో అతిపెద్ద ఫ్లాప్‌లలో ఒకటి గా ఆరెంజ్ ఉంది. అయినప్పటికీ ఈ చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేసారు. అయితే రిజల్ట్ రివర్స్ లో వచ్చింది.  రామ్ చరణ్, జెనీలియా కాంబినేషన్ లో వచ్చిన ఆరెంజ్ చిత్రం ..రీరిలిజ్ అయ్యిన ఈ సమయంలో అనేక రికార్డ్ లు క్రియేట్ చేసింది. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఓ రకంగా రీరిలీజ్ లో అదొక బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

ఇక అదే సమయంలో రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో రూపొంది అప్పట్లో థియేటర్ లో సెన్సేషన్ గా నిలిచిన మగధీర చిత్రం రివర్స్ రిజల్ట్ వచ్చింది. 2009లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఆరెంజ్ చిత్రం పెద్ద డిజాస్టర్ గా నిలిచి నిర్మాతకు బాగా నష్టం పెట్టింది అప్పట్లో.కానీ ఇప్పుడా చిత్రం అభిమానులు తెగ చూసారు. ఆరెంజ్ చిత్రం రీరిలీజ్ ని లాస్ట్ ఇయిర్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేస్తే 3.2 కోట్లు గ్రాస్ వచ్చింది. రిరిలీజ్ టైమ్ లో ఆరెంజ్ వచ్చిన రెస్పాన్స్, డిమాండ్ కు స్క్రీన్ కౌంట్ పెంచారు. అలా ఆరెంజ్ రీరిలీజ్ లో రికార్డ్ లు బ్రద్దలు కొట్టింది.
 
మగథీర చిత్రం రెండు మూడు ప్యాన్స్ షోలకే పరిమితమైంది. ఆక్యుపెన్సీలు చాలా డల్ గా ఉన్నాయి. మగధీర రిజల్ట్ తో పోల్చి చూస్తే ఇప్పుడు రీరిలీజ్ కు వస్తున్న రెస్పాన్స్ డిజాస్టర్ అని చెప్పాలి. కలెక్షన్స్ అయితే అసలు లేనేలేవు. అందుకు కారణం ఏంటనేది ట్రేడ్ విశ్లేషించటానికి ప్రయత్నం చేస్తోంది. మగధీరను అభిమానులు చాలా సార్లు చూసారని, ఆరెంజ్ ని అప్పుడు చూడని వాళ్లంతా ఇప్పుడు చూడటం జరిగిందని, పాటలు సూపర్ హిట్ అవటం ఆరెంజ్ రీరిలీజ్ లో సక్సెస్ అవ్వటానికి కారణం అని తేల్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios