Asianet News TeluguAsianet News Telugu

#PawanKalyan:ఒకే వేదికపై యష్, పవన్ కళ్యాణ్, గెస్ట్ లుగా మెగా ఈవెంట్

 

అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇటు కేజీఎఫ్ చిత్రంతో దేశవ్యాప్త్యంగా అభిమానులను సంపాదించుకున్న యష్..వీళ్లిద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే ఎలా ఉంటుంది. ప్యాన్ ఇండియా పంక్షన్ అయ్యిపోదూ. ఆ క్రేజ్ ఏ రేంజిలో ఉంటుంది. అలాంటిదే ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏ సినిమాకి అంటారా... 

 RC15 first look poster event #PawanKalyan might attend
Author
Hyderabad, First Published Aug 10, 2022, 8:45 AM IST


ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "ఆచార్య" సినిమా తో డిజాస్టర్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నారు. #ఆర్సీ15 అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రాంచరణ్ కరియర్ లో 15వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న 50వ ప్రాజెక్ట్ కూడా.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంభందించిన మూడు ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఒక మోషన్ పోస్టర్ ని దుబాయ్ లో లాంచ్ చేయనున్నారు. దాన్ని మెగా ఈవెంట్ గా ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. #Yash #PawanKalyan లను ఈ ఈవెంట్ చీఫ్ గెస్ట్ లుగా కు పిలుస్తున్నట్లు సమాచారం. అయితే ఇంకా  ఈ విషయమై అఫీషియల్ కన్పర్మేషన్ లేదు. రామ్ చరణ్ మార్క్ మాస్ సినిమా రచ్చకు ఇది కేవలం టీజర్ అంటున్నారు.
 
  రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా, శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై 'దిల్‌' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమాకి ఇప్పటివరకూ ‘విశ్వంభర’, ‘సర్కారోడు’ అనే టైటిల్స్‌ వినిపించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios