Asianet News TeluguAsianet News Telugu

#Eagle కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్, సూపులో ‘యాత్ర 2’

 సంక్రాంతి రేసు నుంచి ఒకరు తప్పుకుంటే బాగుంటుంది అని చర్చ వచ్చినప్పుడు రవితేజ కూడా కో ఆపరేట్ చేయమని చెప్పడంతో తాము రేసు నుంచి తప్పుకున్నామని ‘ఈగల్’ నిర్మాత తెలిపారు.  

Raviteja Eagle new Release Date probolem to Yatra 2? Jsp
Author
First Published Jan 5, 2024, 11:34 AM IST | Last Updated Jan 5, 2024, 11:34 AM IST


ఒక ముడి విప్పుతుంటే మరో ముడిపడినట్లు...ఒక సినిమా కు ఫేవర్ చేయబోతే వేరే సినిమాకు దెబ్బపడుతుందా..ఇప్పుడు అలాంటిదే తెలుగు పరిశ్రమలో జరగబోతోంది అని అంటున్నారు. గత కొద్ది రోజులుగా రవితేజ ఈగల్ చిత్రం రిలీజ్ వాయిదా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వాయిదా పడదని, సెన్సార్ కూడా పూర్తైందని  నిర్మాత ప్రకటించినా లాభం లేకపోయింది. దిల్ రాజు మధ్య వర్తిత్వంతో రవితేజకు చేసిన రిక్వెస్ట్ తో సినిమా వాయిదా పడింది. దాంతో  ‘ఈగల్’ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసారు దిల్ రాజు. అయితే ఎంకి పెళ్లి సుబ్బి చావు కు వచ్చినట్లుగా...ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లుగా ఈ రిలీజ్ డేట్ మార్పు  ‘యాత్ర 2’పై పడుతోంది. వివరాల్లోకి వెళితే...
 
సంక్రాంతికు రిలీజ్ కు రెడీ అయిన అయిదు సినిమాలలో ఒకటి స్వచ్ఛందంగా తప్పుకోవాలని నిర్ణయించుకుంది. అదే ‘ఈగల్’. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ.. పోటీని దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. అయితే రవితేజ చేసిన ఈ సాయానికి వారికి ఏ పోటీ లేకుండా ఒక సోలో రిలీజ్ డేట్ ఇచ్చామని, కొత్త విడుదల తేదీని తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో అనౌన్స్ చేశారు నిర్మాత దిల్ రాజు.

దిల్ రాజు మాట్లాడుతూ...‘‘ఈగల్ ఫిబ్రవరి 9న రావడానికి డేట్ అడిగారు. ఆ సినిమా 9కు రావాలి. కానీ ఇప్పటికే రెండు సినిమాలు ఆ విడుదల తేదీని అనౌన్స్ చేశాయి. ఆ రెండు సినిమాల నిర్మాతలతో కూడా మాట్లాడాము. వాళ్లని ఒప్పించి.. ఫిబ్రవరి 9న ఈగల్ వచ్చేలాగా చూస్తున్నాం. నిర్మాత నాగవంశీకి ‘గుంటూరు కారం’ రిలీజ్ రెడీగా ఉంది కాబట్టి ఆయన వెంటనే ‘డీజే టిల్లు 2’ను పోస్ట్‌పోన్ చేయడానికి ఓకే చెప్పారు. ఇంకొక మూవీ ‘యాత్ర 2’ ఉంది. దాని నిర్మాత ఇంకా కాంటాక్ట్ కాలేదు. ఆయనతో కూడా మాట్లాడి వీలైతే ఇంకొక వారం ముందు అయినా, తరువాత అయినా విడుదల తేదీ చూసుకోమని అడుగుతాము’’ అంటూ ‘ఈగల్’ కొత్త విడుదల తేదీ ఫిబ్రవరి 9 అని అనౌన్స్ చేశారు దిల్ రాజు. ఇక సంక్రాంతి రేసు నుంచి ఒకరు తప్పుకుంటే బాగుంటుంది అని చర్చ వచ్చినప్పుడు రవితేజ కూడా కో ఆపరేట్ చేయమని చెప్పడంతో తాము రేసు నుంచి తప్పుకున్నామని ‘ఈగల్’ నిర్మాత తెలిపారు. అంటే ఇప్పుడు బాల్ యాత్ర 2 నిర్మాత దగ్గరకు వెళ్లి ఆగిందన్నమాట. ఎవరూ ఊహించని పరిమాణం ఇది..
 
దిల్ రాజు ఈ రిలీజ్ డేట్ మార్పు గురించి మాట్లాడుతూ...‘‘ఇది అంత ఈజీ కాదు. సినిమా కాపీ రెడీగా పెట్టుకొని మూడు, నాలుగు వారాలు విడుదలను పోస్ట్‌పోన్ చేయాలంటే ఒక నిర్మాతకు ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో తెలుసా? ఎకానమీ చాలామందికి తెలియదు. మాకు నిర్మాతలుగా ప్రతీ రూపాయి లెక్క ఉంటుంది. ఒక నెల సినిమాను వాయిదా చేయాలంటే.. పెట్టుబడి పెట్టి, కాపీ రెడీ చేసి రిలీజ్‌ను వెనక్కి తోయాలి. అంత డ్యామేజ్ ఉంటుంది నిర్మాతకు. హీరోకు కూడా అంతే. సంక్రాంతికి ఉండే కిక్ వేరే దగ్గర తగ్గుతుంది. సోలోగా వచ్చినప్పుడు ఎకనామిక్స్ పరంగా ఎక్కువ లాభం ఉంటుంది. అయిదు సినిమాలతో వచ్చేదానికంటే సోలోగా వస్తే లాభం ఎక్కువ ఉంటుంది. కానీ సంక్రాంతి అనేవరకు కోడిపందెలలాగా మన సినిమా రావాలి, ఏదో జరగాలి అనే ఆతృత ఉంటుంది’’ అంటూ ఒక మూవీ విడుదలను పోస్ట్‌పోన్ చేస్తే నిర్మాతకు జరిగే నష్టం గురించి వివరించారు దిల్ రాజు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios