కరోనా వైరస్‌ కారణంగా క్రికెట్ సహా అన్ని క్రీడలు నిలిచిపోయాయి. ప్రతిష్టాత్మక టోర్నమెంట్స్‌కు కూడా బ్రేక్‌ పడటంతో స్టార్ ప్లేయర్స్‌ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడు ప్రయాణాలతో ప్రాక్టీస్‌లతో బిజీగా ఉండే స్టార్ ప్లేయర్స్‌కు ఖాళీ సమయం దొరకటంతో ఈ ఖాళీ సమయాన్ని సరదాగా స్పెండ్‌ చేస్తున్నారు. ఫన్నీ వీడియోస్‌ను తమ సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇండియన్‌ క్రికెటర్‌ రవిచంద్రన్‌ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు.

ఈ లాక్‌ డౌన్‌లో భాగంగా ఇంట్లో ఉన్న రవీచంద్రన్‌ కొన్ని ఫన్నీ మీమ్స్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేస్తున్నాడు. అందులో భాగంగా కోలీవుడ్‌ సూపర్‌ స్టార్ రజనీకాంత్ కెరీర్‌ మంచి పీక్స్‌లో ఉండగా చేసిన ఓ ఫన్నీ యాక్షన్‌ సీన్‌ను తన వీడియోను షేర్ చేశాడు. విలన్‌లు బాంబులు విసురుతుంటే వాటిని క్యాచ్‌ పట్టుకున్న రజనీ తిరిగి విలన్ల మీదకు విసరటం లాంటి సన్నివేశాలతో వీడియో ఫన్నీగా ఉంది.

అయితే ఈ వీడియోను షేర్ చేసిన అశ్విన్‌.. ఆన్ లైన్‌ కోచింగ్ అలెర్ట్‌... కొన్ని ఫీల్డింగ్ డ్రిల్స్‌. ఇది ఇంటి దగ్గర ప్రాక్టీస్‌ చేయండి.. కానీ పేలుడు పదార్థాలు మాత్రం వాడకండి. సాఫ్ట్ బాల్స్‌ మాత్రమే వాడండి. తలైవార్‌ లాక్‌ డౌన్‌ లెసన్స్‌` అంటూ ఈ వీడియోను షేర్ చేశాడు అశ్విన్. ఈ వీడియోపై అభిమానులు కూడ అదే స్టైల్‌లో ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.