వైవిధ్యమైన కథలతో సినిమాలు చేయడం రవిబాబు స్టైల్... అందులో భాగంగానే అనసూయ, అవును లాంటి సినిమాలు వచ్చి మంచి సక్సెస్ ని అందుకున్నాయి. ఇప్పుడు ఆవిరి అనే మరో వైవిధ్యమైన కథతో  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవిబాబు.. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. రవిబాబు ప్రతీ సినిమాకు వెనక సురేష్ బాబు ఉంటూ వచ్చారు. అయితే ఈ సారి ఆయన సీన్ లోంచి తప్పుకున్నారు. దాంతో ఈ సారి దిల్ రాజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేసారు. ఈ సినిమాపై రవిబాబు చాలా ఆశలు పెట్టుకున్నారు. అవును సినిమాలా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందనుకున్నారు. అయితే  ఆవిరి...ఆయన ఆశలను ఆవిరి చేసేసేంది.
 
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి.  `ఆవిరి` సినిమా హార‌ర్ సినిమా కాదు. ఫ్యామిలీ థ్రిల్లర్ క్రింద అలరించలేకపోయింది‌. పేరెంటింగ్ అనే మెసేజ్‌కు ఆత్మను జోడించి హారర్ థ్రిల్లర్ జోనర్‌లో రవిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.  రీపిటేడ్ సీన్స్ తో చాలా సార్లు బోర్ కొట్టించాడు. రవిబాబు ఇటు దర్శకుడిగా.. అటు నటుడిగా మరో వైపు నిర్మాతగా త్రిపాత్రాభినయం పోషించాడు.
 
ఇంత‌కు ముందు రవిబాబు తీసిన సినిమాల‌న్నీ కూడా థ్రిల్లర్ సినిమాలే. క‌థ‌ను చెప్పడంపైనే ఆయన ఫోక‌స్ పెట్టేవారు. ప్రేక్ష‌కుల‌ను ఏదో భ‌య‌పెట్టాల‌ని ఆలోచించే వారు కాదు. కానీ ఇప్పుడు ఆయన కేవలం సినిమా లెంగ్త్ ఫిల్ చేయటలమే లక్ష్యంగా సీన్స్ అల్లు కున్నట్లుగా చేసారు. ప్రేక్షకుల‌ను భ‌య‌పెట్టను లేకపోయారు, థ్రిల్లూ చేయలేకపోయారు.  

ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా నటించారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్పణ‌లో ఎ ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్ ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై ర‌విబాబు దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం న‌వంబర్ 1న విడుద‌ల అయ్యింది.