ప్రస్తుతం రవితేజ డెస్పరేట్ గా ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరస ఫ్లాఫ్ లతో కంగారుపడ్డ రవితేజ..ఆచి తూచి ఓ ప్రాజెక్టు ఓకే చేసి ముందుకు వెళ్లాడు. దృష్టితా దానిపైనే పెట్టాడు. అదే ‘డిస్కోరాజా’.   వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తైంది. రిలీజ్ కు రెడీగా ఉంది. ఇప్పటికే టీజర్ రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో ఫైనల్ అవుట్ ఫుట్ మొత్తం చూసిన రవితేజ హ్యాపిగా లేడంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా లో సైన్స్ కు సంభందించిన ఎలిమెంట్స్ సరిగ్గా డీల్ చేయలేదని ఫీలవుతున్నాడట. ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేదని, అవకాసం ఉంటే రీషూట్ పెడదామని అన్నారట. దాంతో నిర్మాతలు కంగారుపడుతున్నట్లు చెప్తున్నారు. దర్శకుడు ఆనంద్ మాత్రం తన ప్రొడక్ట్ పై పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. దాంతో రీషూట్స్ అక్కర్లేదని, ఈ అవుట్ ఫుట్ చాలని అని తేల్చి చెప్పాడట.  రవితేజ ఫ్లాఫ్ భయంతో ..అతి జాగ్రత్తతో అడగటమే కానీ అవుట్ ఫుట్ అదిరిందని నిర్మాతలు నమ్ముతున్నారు. కానీ రవితేజ ..ఈ విషయమై పట్టుపడుతున్న నేపధ్యంలో రీషూట్స్ పెట్టాలా వద్దా అనే విషయమై గత కొద్ది రోజులుగా టీమ్ మధ్య డిస్కషన్స్ జరుగుతున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.

రవితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌  హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి  వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ తాళ్లూరి నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రం మంచి బడ్జెట్ తో రూపొందుతోంది. ‘డిస్కో రాజా’  వచ్చే ఏడాది జనవరి 24న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ఇప్పటికే ప్రకటించింది.  ఈ చిత్రంలోని బుర్మ సేతు అనే పాత్రలో నటిస్తున్నారు తమిళ నటుడు బాబీ సింహా.

‘‘వి.ఐ.ఆనంద్‌ విభిన్నమైన కథ,  స్క్రీన్ ప్లే తో రూపొందిస్తున్న చిత్రమిది. రవితేజ స్టైల్ లో ఎంటర్టైన్మెంట్  ఉంటూనే, ప్రేక్షకుల్ని ఆసక్తికి గురిచేసే అంశాలు ఉంటాయి’’ అని నిర్మాత రామ్‌ తళ్లూరి తెలిపారు.  ‘డిస్కో రాజా’ చిత్రంతో పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ హీరోయిన్ పాత్రలు పోషిస్తున్నారు. వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.  బాబీ సింహా, వెన్నెల కిషోర్‌, సత్య, తాన్య హోప్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, మాటలు: అబ్బూరి రవి, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్‌.