టాలీవుడ్ లో ఫెస్టివల్స్ ని టార్గెట్ చేసుకొని కొన్ని సినిమాలు చకచకా షూటింగ్ పనులను ముగించుకుంటున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి కోసం పెద్ద హీరోల నుంచి మీడియం హీరోల వరకు అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొందరైతే సంక్రాంతికి వస్తున్నట్లు పోస్టర్స్ ని కూడా వదిలారు. ఇక పొంగల్ కంటే ముందు క్రిస్మస్ సెలవుల్ని కూడా టార్గెట్ చేశారు.

ఆ లిస్ట్ పెద్దగానే ఉన్నప్పటికీ రెండు మూడు రోజుల గ్యాప్ లో కొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. కానీ ఇద్దరు హీరోలు మాత్రం ఒకేరోజు బాక్స్ ఆఫీస్ వద్ద యుద్దానికి దిగారు. బాలకృష్ణ - రవితేజ నెక్స్ట్ సినిమాలు డిసెంబర్ 20న బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ కానున్నట్లు తెలుస్తోంది. సి కళ్యాణ్ నిర్మాతగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ తుది దశలో ఉంది.  ఈ సినిమాలో బాలకృష్ణ స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నాడు.

రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్స్ కి ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక మాస్ రాజా సైన్స్ ఫిక్షన్ సినిమా డిస్కో రాజా కూడా డిసెంబర్ 20న విడుదల కాబోతోంది. విఐ.ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై కూడా ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ముందు నుంచి సినిమానుక్రిస్మస్ కి విడుదల చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రవితేజ బాలయ్య మధ్య ఫైట్ తప్పేలా లేదనిపిస్తోంది. మరి రెండు సినిమాల్లో ఏ సినిమా అత్యధిక కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.